ప్ర‌భాస్‌తో స‌మ‌రానికి సై అంటున్న హీరో!

మరిన్ని వార్తలు

టాలీవుడ్‌లోనే కాదు, బాలీవుడ్‌లోనూ అంద‌రి టాపిక్కూ.. సాహో గురించే! టీజ‌ర్ వ‌చ్చాక అది మ‌రింత ఎక్కువైంది. సాహో టీజ‌ర్ అంత‌ర్జాతీయ సినిమాల స్థాయిలో ఉండ‌డంతో ఈ సినిమా రికార్డుల‌న్నీ షేక్ చేస్తుంద‌న్న న‌మ్మ‌కం మ‌రింత ఎక్కువైపోయింది. సాహోకి అటూ ఇటూ సినిమాల్ని విడుద‌ల చేసే ధైర్యం చేయ‌డం లేదిప్పుడు. కానీ... ప్ర‌భాస్‌కి పోటీగా ఓ బాలీవుడ్ హీరో బ‌రిలోకి దిగుతున్నాడు. స‌రిగ్గా ఆగ‌స్టు 15నే త‌న సినిమాని రంగంలోకి దింపుతున్నాడు. త‌నే అక్ష‌య్ కుమార్‌. అక్ష‌ర్ కుమార్ క‌థానాయ‌కుడిగా న‌టించిన బాలీవుడ్ చిత్రం మిష‌న్ మంగ‌ల్‌. విద్యాబాల‌న్‌, సోనాక్షీ సిన్హా క‌థానాయిక‌లు.

 

ఈ చిత్రాన్ని ఆగ‌స్టు 15న విడుదల చేస్తున్నారు. సాధార‌ణంగా ఓ తెలుగు సినిమాకి బాలీవుడ్ సినిమా పోటీ కాదు. కానీ.. సాహోని బాలీవుడ్ లో భారీగా విడుద‌ల చేస్తున్నారు. హిందీ రైట్స్ కూడా భారీ మొత్తానికి అమ్ముడ‌య్యాయి. బాలీవుడ్‌లో గ‌ట్టిగా ప్ర‌చారం చేసి - సాహోకి ప్ర‌మోష‌న్లు క‌ల్పించాల‌ని చిత్ర‌బృందం భావిస్తోంది. దాదాపు బాలీవుడ్‌లో స‌గం థియేట‌ర్లు ఆక్ర‌మించుకోవాలన్న‌ది సాహో టీమ్ ల‌క్ష్యం. ఇప్పుడు అక్ష‌య్ కుమర్ కూడా రంగంలోకి దిగ‌డంతో.... హిందీ నాట ప్ర‌భాస్ సినిమాకి కావ‌ల్సిన సంఖ్య‌లో థియేట‌ర్లు దొరుకుతాయా? లేదా? అనేది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS