దివంగత సుప్రసిద్ధ నటుడు, పద్మశ్రీ గ్రహీత వివేక్ పేరుతో చెన్నైలో ఓ రోడ్డు వెలసింది. గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ విరుగంబాక్కంలోని వివేక్ నివసించిన రహదారికి 'చిన్న కలైవానర్ వివేక్ రోడ్‌గా' పేరు మార్చింది. జిసిసి సిఫార్సు మేరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ దీనికి సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది.
వివేక్ ని ‘చిన్న కలైవానర్’అని అభిమానులు పిలిచేవారు. అనేక చిత్రాలలో అలరించిన వివేక్ గత ఏడాది గుండెపోటుతో మరణించారు. వివేక్ నటన తెలుగు ప్రేక్షకులు కూడా ఇష్టపడేవారు. శివాజీలో రజనీకి మామగా, సింహంలో పోలీసుగా.. ఇలా అనేక పాత్రలతో తెలుగు వారికి దగ్గరయ్యారు వివేక్. ఇప్పుడు ఆయన పేరుని ఆయన నివసించిన రోడ్డకి పెట్టడం వివేక్ ని స్మరించుకుంటూ గౌరవించినట్లయింది.