బిగ్‌ కన్నింగ్‌: హిమజ మళ్లీ దొరికేసిందోచ్‌!

By Inkmantra - September 17, 2019 - 13:15 PM IST

మరిన్ని వార్తలు

బిగ్‌బాస్‌ సీజన్‌ 3లో కన్నింగ్‌ అండ్‌ సెల్ఫిష్‌ ఎవరు.? అంటే నో డౌట్‌, హిమజ.. అంతే అని ఠక్కున చెప్పేస్తారు.. బిగ్‌బాస్‌ చూసిన ఏ ఒక్కరైనా. తాజా ఎపిసోడ్‌లో నామినేషన్‌ ప్రక్రియను వింతగా డిజైన్‌ చేశారు బిగ్‌బాస్‌. గార్డెన్‌ ఏరియాలో ఓ టెలిఫోన్‌ బూత్‌ పెట్టి, అందులోకి ఒక్కొక్కరినీ పిలిచి, బిగ్‌బాస్‌ డైరెక్ట్‌గా నామినేట్‌ చేశారు. ఆ నామినేషన్‌ నుండి సేవ్‌ అయ్యే మార్గాన్ని కూడా సూచించారు.

 

ఆ క్రమంలో మహేష్‌ ఎలిమినేషన్‌ నుండి తప్పుకోవాలంటే, హిమజ తన బట్టలనూ, మేకప్‌ కిట్స్‌నీ శాక్రిఫై చేయాల్సి వచ్చింది. తాను ధరించిన బట్టలు తప్ప, మిగిలిన అన్ని బట్టలూ, మేకప్‌ కిట్‌ని స్టోర్‌ రూమ్‌లో పెట్టేయాలని బిగ్‌బాస్‌ సూచించారు. అయితే, ఈ త్యాగాన్ని హిమజ సక్రమంగా చేయని కారణంగా మహేష్‌ నామినేట్‌ అయ్యాడు. మేకప్‌ కిట్‌ అంటే, తను వాడే గుండు సూది నుండి మొదలుకొని, హెయిర్‌ పిన్స్‌, లిప్‌స్టిక్స్‌ ఫౌండేషన్‌ క్రీమ్స్‌ వగైరా అన్నింటినీ స్టోర్‌ రూమ్‌లో పెట్టేయాలి. కానీ, హిమజ నామ్‌ కే వాస్తే మేకప్‌ ఐటెమ్స్‌ మాత్రమే బిగ్‌బాస్‌కి ఇచ్చింది.

 

బిగ్‌బాస్‌ సూచన మేరకు చెకింగ్‌కి వెళ్లిన కెప్టెన్‌ వితికకు ఏకంగా ఒక బాస్కెట్‌ మేకప్‌ ఐటెమ్స్‌ కనిపించాయి. దాంతో హిమజ కన్నింగ్‌ అండ్‌, సెల్‌ఫిష్‌ నైజం మరోసారి బయటపడింది. పాపం హిమజ కారణంగా మహేష్‌ ఈ వారం కూడా నామినేషన్స్‌లో ఉండాల్సి వచ్చింది. కానీ హిమజ కోసం వరుణ్‌ సందేశ్‌ పేడ తొట్టిలో పడుకోవాల్సి వచ్చింది. చాలా కష్టపడి ఆ టాస్క్‌ పూర్తి చేశాడు వరుణ్‌. వరుణ్‌ కోసం శ్రీముఖి బిగ్‌బాస్‌ 'ఐ'ని టాటూగా వేయించుకుంది. బాబా భాస్కర్‌ కోసం తన షూస్‌ అన్నింటినీ పెయింట్‌లో ముంచేశాడు రవి. శివజ్యోతి కోసం హెయిర్‌కి రెడ్‌ కలర్‌ వేసుకున్నాడు మహేష్‌. శ్రీముఖి కోసం బాబా భాస్కర్‌ గెడ్డం తీసేశాడు. ఇలా ఈ త్యాగాల టాస్క్‌ తాజాగా బిగ్‌బాస్‌ ప్రియుల్లో మిశ్రమ స్పందనకు వేదికయ్యింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS