కమర్షియల్ హీరోయిన్‌గా పూజా హెగ్దే నెంబర్ వన్ ఛైర్‌ని అధిరోహించేందుకు దగ్గరగా ఉంది. సక్సెస్, ఫెయిల్యూర్‌తో సంబంధం లేకుండా వరుస అవకాశాలు వరిస్తున్నాయి పూజా హెగ్దేని. అందులోనూ అన్నీ ప్రెస్టీజియస్ ప్రాజెక్టులు కావడం విశేషం. పూజా ఉందంటే, ఆ సినిమాకి స్టార్ వేల్యూ పెరుగుతుందనడం అతిశయోక్తి కాదనేలా ప్రస్తుతం ఆమె క్రేజ్ నడుస్తోంది టాలీవుడ్‌లో. మరి కొద్ది రోజుల్లో పూజా హెగ్దే 'వాల్మీకి' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
అయితే, ఈ సినిమాలో పూజా హెగ్దే క్యారెక్టర్ కన్నా, మరో హీరోయిన్ మృణాళిని క్యారెక్టర్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుందట. అయితే, పూజా హెగ్దే క్యారెక్టర్ సినిమాకి చాలా కీలకమట. తక్కువ సమయమే కనిపించినా కథకు మలుపు తిప్పే క్యారెక్టర్ అట. క్యారెక్టర్ చిన్నదే అయినా, ఆ పాత్ర గురించి చాలా ఎక్కువే చెబుతున్నారు. ఇంతకీ ఆమె పాత్ర ఏంటని అడిగితే, మాత్రం 'చెప్పను బాస్..' అంటూ అస్సలు మొహమాటం లేకుండా చెబుతున్నాడు డైరెక్టర్ హరీష్ శంకర్.
ఆమె లుక్‌ని బట్టి క్యారెక్టర్ అంచనా వేయడానికి లేదట. సస్పెన్స్ అండ్ స్టన్నింగ్ రోల్‌లో పూజా నటిస్తోందట. అన్నట్లు పూజా హెగ్దే గురించి సినిమా స్టార్ట్ అయిన అరగంటో, గంట నుండో ఎదురు చూస్తే మీ ఎదురు చూపులు ఫలించవు. పూజా క్యారెక్టర్ సెకండాఫ్‌లో వస్తుందట. అంటే అంతవరకూ పూజా కనిపించదా.? అంతేగా.. అంతేగా..!