'బిగ్‌' హాట్‌ న్యూస్‌: ప్యాంట్‌లో చెయ్యి పెడితే కొట్టరా?

మరిన్ని వార్తలు

'చీమా.. చీమా ఎందుకు కుట్టావ్‌..' అంటే, నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా.! అందట. అది మన చిన్నప్పటి చీమ కథ. కానీ, మనం మాట్లాడుకునేది బిగ్‌ హౌస్‌లోని ఓ చిన్న కథ. అది ఏంటంటే, 'హిమజ ప్యాంట్‌లో అలీ చెయ్యి పెట్టాడు..' అవును మీరు విన్నది నిజమే. హిమజ ప్యాంట్‌ పోకెట్‌లో అలీ చెయ్యి పెట్టాడు. డబ్బుల కోసం. 'దొంగా పోలీస్‌' టాస్క్‌లో భాగంగా, డబ్బులు చెల్లించకుండా వాటర్‌ తాగిందన్న కారణంగా, ఆ డబ్బుల కోసం అలీ హిమజ దగ్గర బలవంతంగా డబ్బులు గుంజబోయాడు.

 

ఆ క్రమంలోనే ఆమె పోకెట్‌లో చెయ్యి పెట్టాడు. ఆ సందర్భంలో హిమజ చాలా ఓవర్‌గా రియాక్ట్‌ అయ్యింది. అలీ చెంప పగలగొట్టింది. కాలితో తన్నేసింది. దాంతో అక్కడ పెద్ద ఇష్యూ అయ్యింది. డబ్బులడిగితే, తన్నేస్తావా.? అంటూ అలీ, హిమజ మీదకి గొడవకు దిగాడు. 'నా బాడీ లాంగ్వేజ్‌.. అంతే,' అని హిమజ వాదులాడింది. అయినా, అక్కడ టచ్‌ చేస్తే, అమ్మాయిలకెవరికైనా అలాగే కోపమొస్తుంది. నాలాగే రియాక్ట్‌ అవుతారు.. అంటూ హిమజ నచ్చ చెప్పే ప్రయత్నం చేసినా, ఆలీ ఊరుకోలేదు.

 

దాంతో చివరికి హిమజ అలీకి సారీ చెప్పింది. అయినా అలీ నీ బుద్ది ఏంటో తెలిసిందిలే.. అంటూ పర్సనల్‌గా కార్నర్‌ చేస్తూ, ఆమె సారీని యాక్సెప్ట్‌ చేయకపోవడంతో, గొడవ మరీ ముదిరింది. ఎట్టకేలకు హిమజ, అలీ కాళ్లు పట్టుకుని పెద్ద సీన్‌ క్రియేట్‌ చేసింది. ఎలాగైతేనేం, మిగిలిన హౌస్‌ మేట్స్‌ సర్ది చెప్పడంతో, ఎట్టకేలకు అలీ కూల్‌ అవ్వడంతో, ఈ ఇష్యూ అంతటితో క్లోజ్‌ అయ్యింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS