'సాహో' రిలీజ్ కోసం దేశ వ్యాప్తంగా కొన్ని సినిమాలు రిలీజ్లు డేట్స్ అడ్జస్ట్ చేసుకున్నాయి. నాని రావల్సిన డేట్లో 'సాహో' వచ్చి చేరడంతో పాపం నాని పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ఎప్పటి నుండో అనుకున్న డేట్ అలా 'సాహో' పరం అయిపోయేసరికి, సెప్టెంబర్ 13న నాని 'గ్యాంగ్‌లీడర్'ని అడ్జస్ట్ చేసుకుందామా.? అంటే, ఆ డేట్లో ఆల్రెడీ ఖర్చీఫ్ వేసేశాడు మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్. అదే రోజు 'వాల్మీకి'తో వచ్చేస్తున్నాడు. ఎంతో కొంత రిస్క్ చేయాలంటే ఇదే డేట్‌ని నాని ఫిక్స్ చేసుకోవాలి.
అయితే, మైత్రీ సంస్థ రిస్క్ చేయడం ఎందుకులే అని ఆలోచిస్తోందట. ఆ తర్వాతి వారం బెటర్‌గా ఉంటుందని ఆలోచిస్తున్నారట. ఆ డేట్లో సూర్య 'బందోబస్త్'తో వస్తున్నాడు. అయితే, లోకల్ సినిమాలతో పెట్టుకునే కన్నా, డబ్బింగ్ సినిమాలతో పోటీనే బెటర్ అనుకుంటున్నారట. ఈ మధ్య సూర్య సినిమాలు తెలుగులో అంతగా ఆదరణ దక్కించుకోలేకపోతున్నాయి.
సో 'గ్యాంగ్‌లీడర్'కి సెప్టెంబర్ మూడో వారమే కరెక్ట్ అనిపిస్తోంది. అయితే, సెప్టెంబర్‌ని సినిమా లాంగ్వేజ్‌లో డ్రై మంత్ అనే ఓ అభిప్రాయం ఉంది. ఒకవేళ నాని 'గ్యాంగ్‌లీడర్'తో హిట్ కొడితే, ఆ అభిప్రాయం తొలిగిపోయే అవకాశాలున్నాయి. ఆ ఛాన్స్ మిస్ చేసుకుంటే, అక్టోబర్‌లో 'సైరా'తో ఢీ కొట్టడం నాని వల్ల కాదనే చెప్పాలి. చూడాలి మరి, నాని అండ్ హిజ్ గ్యాంగ్‌కి పోటీ ఎవరితోనో.?