హిట్ కి సీక్వెల్ గా వచ్చిన సినిమా హిట్ 2. అడవిశేష్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి నాని నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. శుక్రవారం విడుదలైన సినిమా బాక్సాఫీసు దగ్గర మంచి టాక్ సంపాదించుకొంది. తొలి మూడు రోజులకూ... రూ.14.8 కోట్ల షేర్ సాధించింది. అడవిశేష్ కెరీర్‌లో ఇదే రికార్డు.
నైజాంలో ఈ చిత్రానికి రూ.5 కోట్లు వచ్చాయి. సీడెడ్‌లో రూ.కోటి, ఉత్తరాంధ్రలో 1.2 కోట్లు, గుంటూరు 70 లక్షలు సంపాదించింది. ఓవర్సీస్ లో రూ.3.5 కోట్లు తెచ్చుకొంది. ఈనెల 9న కూడా కొన్ని సినిమాలు విడుదల అవుతున్నాయి. అయితే.. వాటిలో క్రేజీ సినిమాలేం లేవు. కాబట్టి.. ఈ వీకెండ్ కూడా.. హిట్ 2 మంచి వసూళ్లే అందుకొనే అవకాశం ఉంది. హిట్ 1తో పోలిస్తే.. హిట్ 2నే ఆర్థికంగా పెద్ద హిట్టన్నది ట్రేడ్ వర్గాల మాట. సో.. నాని నిర్మాత మరో హిట్టు కొట్టినట్టే.