‘రిపబ్లిక్’ సినిమా విడుదలకు ముందు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు సాయితేజ్. కొంతకాలం విశ్రాంతి తీసుకొని ఇప్పుడు మళ్ళీ సినిమా షూటింగులకు హాజరౌతున్నారు. సాయితేజ్ కథానాయకుడిగా... కార్తీక్ దండు దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. సంయుక్త మేనన్ కథానాయిక. ఈ చిత్రానికి ఎన్టీఆర్ మాట సాయం అందిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ టీజర్ కి ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అందించారు.
సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్నారు. సుకుమార్ అందించిన కథతో రూపొందుతున్న ఈ సినిమాకి ఇంకా పేరు ఖరారు చేయలేదు. మిస్టిక్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా ఓ గ్రామం నేపథ్యంలో సాగుతుందని టాక్. డిసెంబర్ 7 టైటిల్ టీజర్ విదుదలౌతుంది.