సాధారణంగా సీక్వెల్స్ అంటే.. అదే హీరో, అదే డైరెక్టర్ రిపీట్ అవుతారు. కానీ.. ఈసారి అలా జరగడం లేదు. డైరెక్టర్ అతనే ఉన్నా, హీరో మారుతున్నాడు. ఆ సీక్వెల్.. `హిట్`.
నాని నిర్మాతగా. విశ్వక్ సేన్ హీరోగా `హిట్` సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా బాగా ఆడింది. నానికి డబ్బులు బాగా తెచ్చింది. హిందీలో రీమేక్ కూడా అవుతోంది. `హిట్` సినిమా క్లైమాక్స్ లో దీనికి సీక్వెల్ కూడా ఉంటుందని హింట్ ఇచ్చాడు.. దర్శకుడు. అనుకున్నట్టుగానే సీక్వెల్ కి సరిపడా కథ రాసుకున్నాడు. అయితే... ఇప్పుడు హీరో మారాడు. విశ్వక్ సేన్ బదులు.. అడవిశేష్ వచ్చాడు. ఈ విషయాన్ని అధికారికంగానూ ప్రకటించేశారు. ఇందులో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కృష్ణదేవ్ గా అడవిశేష్ కనిపించబోతున్నాడు. నానినే నిర్మాత. శైలేష్ దర్శకత్వం వహించబోతున్నాడు. త్వరలోనే ఈసినిమా పట్టాలెక్కబోతోంది.