చిత్రం: హిట్ లిస్ట్
విడుదల తేదీ: 31 మే 2024
నటీనటులు: విజయ్ కనిష్క, శరత్ కుమార్, సముద్రఖని, గౌతమ్ వాసుదేవ మీనన్
ఐక్లిక్ మూవీస్ రేటింగ్: 2.75/5
ఈ మధ్య కాలంలో బాషా భేదం లేకుండా ఇతర పరిశ్రమకు చెందిన సినిమాలు అన్ని భాషల్లో రిలీజ్ అవుతున్నాయి. చిన్న సినిమా గా వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంటున్నాయి. అందులో క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు కూడా మంచి సక్సెస్ ని అందుకుంటున్నాయి. అలాంటి నేపథ్యంలో వచ్చిన మూవీ హిట్ లిస్ట్. తమిళ డైరెక్టర్ విక్రమన్ కొడుకు విజయ్ కనిష్క హీరోగా సముద్రఖని, శరత్ కుమార్, గౌతమ్ వాసుదేవ మీనన్ ముఖ్యపాత్రలో నటించిన సినిమా ఇది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ ఆకట్టుకున్నాయి. సూర్య కతిర్ కాకల్లార్, కే. కార్తికేయన్ దర్శకత్వంలో ఆర్. కె. సెల్యులాయిడ్స్ పై డైరెక్టర్ కె ఎస్. రవికుమార్ గారు నిర్మిస్తున్న సినిమా. ఈ సినిమా ప్రేక్షకుల్ని మెప్పించిందో లేదో చూద్దాం!
కథ:
విజయ్ (విజయ్ కనిష్క) తన అమ్మ (సితార), చెల్లి తో కలిసి ఒక సాధారణమైన జీవితాన్ని గడుపుతుంటారు. ఓ రోజు తనకు ఒక కాల్ వస్తుంది. మీ అమ్మని, చెల్లిని కిడ్నాప్ చేశాను వాళ్ళని వదిలి పెట్టాలంటే నేను చెప్పింది చేయాలి అని డిమాండ్ చేస్తాడు మాస్క్ మాన్. కిడ్నాపర్ నుంచి అమ్మని, చెల్లాయిని రక్షించడానికి విజయ్ ఇద్దరిని మర్డర్ చేయాల్సి వస్తుంది. ఈ కేసుని ఏసిపి యెజ్హ్వెందన్ (శరత్‌కుమార్) ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. విజయ్ కి సపోర్ట్ గా కూడా ఉంటాడు. అసలు ఈ మాస్క్ మాన్ ఎవరు? విజయ్ అమ్మని, చెల్లిని ఎందుకు కిడ్నాప్ చేశాడు తెలియాలంటే మూవీ చూడాల్సిందే!
విశ్లేషణ:
యాక్షన్, సస్పెన్స్, క్రైమ్ మూవీస్ చాలానే చూశాం, హిట్ లిస్ట్ మూవీలో ఒక కొత్త క్రైమ్ థ్రిల్లర్ ని చూడొచ్చు. మూవీ స్టార్ట్ అయిన కొన్ని నిమిషాలు నిమ్మదిగా అనిపించినా, ఆ తర్వాత ప్రేక్షకుడిలో ఆసక్తి మెదలు అవుతుంది. విజయ్ తన అమ్మని చెల్లిని కాపాడుకోవడానికి మాస్క్ మాన్ చెప్పింది చేయడం, ఏసిపి యెజ్హ్వెందన్ గా శరత్‌కుమార్ తన మార్క్ యాక్షన్ తో మెదటి భాగం నడుస్తుంది. ఇక రెండో భాగం మాత్రం ఎక్కడా బోర్ కొట్టకుండా సాగిపోతుంది. కరోనా పాండమిక్ గురుంచి, అప్పుడు ప్రపంచం ఎదుర్కొన్న కొన్ని సంఘటనలను మూవీలో చూపించడం ఎమోషనల్ గా అనిపిస్తాయి. ఈ సినిమా క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ చాలా కొత్తగా ఉంటుంది. ఇది ఈ సినిమాకు హైలైట్ అని చెప్పవచ్చు.
నటీ నటులు:
విజయ్ కనిష్క కి ఇది మొదటి సినిమా అయిన నటన పరంగా పర్వాలేదనిపించాడు. ముఖ్యంగా యాక్షన్ సీన్స్, ఎమోషనల్ సీన్స్ లో చాలా బాగా యాక్ట్ చేశాడు. శరత్‌కుమార్ ఈ సినిమాలో కీ రోల్ ప్లే చేశాడు. అతని పాత్ర హీరోతో సమానంగా ఉంటుంది. గౌతమ్ వాసుదేవ్ మీనన్, సముద్రఖని తమ పాత్రలతో మెప్పించారు.
ప్లస్ పాయింట్స్
రెండో భాగం
శరత్‌కుమార్
నిర్మాణ విలువలు
మైనస్ పాయింట్స్
ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్
స్క్రీన్ ప్లే
ఫైనల్ వర్దిక్ట్ : విభిన్నమైన క్రైమ్ థ్రిల్లర్
నటీనటులు :
విజయ్ కనిష్క, శరత్ కుమార్, సముద్రఖని, గౌతమ్ వాసుదేవ మీనన్, మునిష్కాంత్ కింగ్స్ లే, సితార, స్మృతి వెంకట్, రామచంద్ర రాజు (కే జి ఎఫ్ గరుడ), రామచంద్రన్, ఐశ్వర్య దత్త, అభి నక్షత్రం.
టెక్నీషియన్స్ :
నిర్మాణం : ఆర్. కె. సెల్లులాయిడ్స్
నిర్మాత : కె. ఎస్ రవికుమార్
ఎడిటర్ : జాన్ అబ్రహం
మ్యూజిక్ : సి. సత్య
డి ఓ పి : కే. రామ్ చరణ్
కథ : ఎస్. దేవరాజ్
దర్శకత్వం : సూర్య కతిర్ కాకల్లార్, కే. కార్తికేయన్
తెలుగు వరల్డ్ వైడ్ రిలీజ్ : శ్రీ శ్రీనివాస స్క్రీన్స్, శ్రీ శ్రీనివాస ఇన్ఫ్రా, బెక్కం ప్రొడక్షన్స్
తెలుగు వరల్డ్ వైడ్ రిలీజ్ ప్రొడ్యూసర్స్ : శ్రీనివాస్ గౌడ్ మరియు బెక్కం రవీందర్
డిజిటల్ మీడియా : డిజిటల్ దుకాణం
పి ఆర్ ఓ : మధు VR