చెన్నై నగర పోలీసులకి నిన్నటి రోజుని ఎప్పటికి మరిచిపోలేరు. అందుకు గల కారణం కూడా ఆ స్థాయిలో ఉంది.
ఆ వివరాల్లోకి వెళితే, ఒక గుర్తు తెలియని ఫోన్ కాల్ నిన్న చెన్నై పోలీస్ కంట్రోల్ రూమ్ కి వచ్చింది. ఆ కాల్ ప్రకారం, తమిళనాడు ముఖ్యమంత్రి, సూపర్ స్టార్ రజినీకాంత్ ఇళ్ళలో బాంబులు అమర్చినట్టు అవి ఇంకొన్ని గంటల్లో పేలిపోనున్నట్టుగా విషయం తెలిసింది.
అయితే ఆ బెదిరింపులు వచ్చింది ఒకటి ముఖ్యమంత్రికి అయితే మరొకటి అత్యంత ప్రజాదరణ కలిగిన హీరో రజినీకాంత్ కి రావడంతో పోలీసులు ఉలిక్కిపడ్డారు. వెంటనే పోలీసులు ఈ ఇద్దరి ఇళ్ళలో సోదాలు నిర్వహించి అది ఒక ప్రాంక్ కాల్ గా తేల్చారు.
ఆ కాల్ ఎవరు చేశారు అన్న కోణంలో విచారణ చేపట్టారు. త్వరలోనే వారిని పట్టుకుంటామని పోలీసులు ధీమా వ్యక్తం చేశారు. ఇవన్ని పక్కనపెడితే, రాజకీయాల్లోకి ఆరంగేట్రం చేసిన రజినీకాంత్ కి ఇటువంటి బెదిరింపు కాల్ రావడం ఇప్పుడు తమిళనాట హాట్ టాపిక్ గా మారింది.