అభిమాని కోసం అల్లు అర్జున్ ఇలా చేశాడు

మరిన్ని వార్తలు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన అభిమానుల కోసం తన నటన తో వెండితెర పైనే అలరించడమే కాకుండా కాదు నిజ జీవితంలో కూడా ఎవరైనా కష్టాల్లో ఉంటే ఆదుకునే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు.

ఇక విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ పట్టణంలోని దేవసాయి గణేష్ అనే కుర్రాడు ఎముకల క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు. గణేష్చిన్నపటినుండి అల్లు అర్జున్ కి వీరాభిమాని అవ్వడం, తన ఆరోగ్య పరిస్థితి ఇలా క్షీణిస్తుడడంతో, అల్లు అర్జున్ ని ఒకసారి ప్రత్యక్షంగా కలవాలనుకున్నాడు.

ఇది తెలుసుకున్న అల్లు అర్జున్ , స్వయంగా కాకినాడకి విచ్చేసి తన అభిమాని గణేష్ ని స్వయంగా కలిసాడు. అతనితో సుమారు 15 నిమిషాల పాటు గడిపి అక్కడ ఉన్నవారికి ధైర్యం చెప్పాడు.

అలాగే గణేష్ కి ఎటువంటి వైద్యం అందుతుంది అని వాకబు చేసి తనవంతు ఆర్ధిక సాయం అందిస్తాను అని చెప్పి వారికి భరోసా ఇచ్చాడు. మొత్తానికి అల్లు అర్జున్ తెరపైనే కాకుండా తెర వెలుపల కూడా హీరో అని నిరూపించుకున్నాడు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS