సౌత్‌ సూపర్‌స్టార్స్‌ని ఫాలో అవుతున్న హాలీవుడ్‌ స్టార్‌.!

మరిన్ని వార్తలు

మొన్నేమో టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేష్‌బాబుతో లంచ్‌ చేయాలనుందన్నారు. న్యూయార్క్‌ వచ్చినప్పుడు మహేష్‌ని తప్పక కలవాలనుకుంటున్నాననీ, వీలైతే మహేష్‌బాబుతో కలిసి సినిమాలో నటించేందుకూ సిద్ధంగా ఉన్నాననీ, అందుకోసం ఓ స్పై థ్రిల్లర్‌ మూవీని సిద్ధం చేయమని డైరెక్టర్‌ మురుగదాస్‌కి సూచించాడు హాలీవుడ్‌ స్టార్‌ హీరో బిల్‌ డ్యూక్‌. ఇప్పుడు కోలీవుడ్‌ సూపర్‌స్టార్‌ సినిమా 'దర్బార్‌'లో నటించాలనుందనే తన కోరికను ఓపెన్‌గా బయట పెట్టేశాడు. మురుగదాస్‌ దర్శకత్వంలో 'దర్బార్‌' తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని ఉద్దేశించి, బిల్‌ డ్యూక్‌ సోషల్‌ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని తెలిపారు. మురుగదాస్‌కి తన కోరికను తెలియపరుస్తూ ట్వీట్‌ చేశారు. ఆ ట్వీట్‌కి షాకైన మురుగదాస్‌ 'సర్‌ ఇది నిజంగా మీరేనా.?' అని క్వశ్చన్‌ చేశారు.

 

దాంతో బిల్‌ డ్యూక్‌ 'మురుగదాస్‌ నాకు తమిళం రాదు.. కానీ, మీరు తెరకెక్కిస్తున్న 'దర్భార్‌'లో సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌కి సోదరుడిగా కానీ, హీరోయిన్‌ నయనతారకు అంకుల్‌ పాత్రలో కానీ నటించాలనుంది.. ఏమంటారు.? అని మురుగదాస్‌, రజనీకాంత్‌ ఫోటోల్ని ట్యాగ్‌ చేస్తూ ట్వీటేశారు. మరి బిల్‌డ్యూక్‌కి మురుగదాస్‌ ఛాన్సిస్తాడా.? అన్నట్లు యంగ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుధ్‌ రవిచంద్రన్‌కి కూడా ఆయన ఓ ట్వీటేశారు. మాలాంటి నటుల కోసం ఓ మంచి పాటను కంపోజ్‌ చేస్తే బాగుంటుందన్నారు. ఏంటి ఈ హాలీవుడ్‌ స్టార్‌ ఇంతలా సౌత్‌ సినీ ప్రముఖులను ఫాలో అయిపోతున్నారు. నిజంగా ఇది ఆహ్వానించదగ్గ పరిణామమే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS