మోహన్‌బాబుకు ఆ సినిమా వెరీ స్పెషల్‌ ఎందుకంటే!

మరిన్ని వార్తలు

కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌బాబు తమిళ హీరో సూర్యతో ఓ సినిమాలో నటిస్తున్నారు. ఈ రోజు నుండి ఈ సినిమా షూటింగ్‌లో పాల్గనబోతున్నారు. ఈ సినిమాకి సంబంధించి వివరాలు ఆయన మీడియాతో షేర్‌ చేసుకున్నారు. ఈ సినిమా మోహన్‌బాబుకు వెరీ వెరీ స్పెషల్‌అట. ఎందుకంటే, ఇంతవరకూ మోహన్‌బాబు ఒకే ఒక్క లేడీ డైరెక్టర్‌ సినిమాలో నటించారు. అది కూడా లెజెండరీ మహిళ విజయనిర్మల. చాలా కాలం క్రితం విజయ నిర్మల దర్శకత్వంలో మోహన్‌బాబు యాక్ట్‌ చేశారు. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత సూర్య సినిమా కోసం ఆయన లేడీ డైరెక్టర్‌తో పని చేస్తున్నారట. అలా ఈ సినిమా ఆయన కెరీర్‌లో ఎంతో స్పెషల్‌ అంటున్నారు.

 

సుధా కొంగర ఈ సినిమాకి దర్శకురాలు. ఆమె తెరకెక్కించిన 'సాలా ఖడూస్‌' బైలింగ్వల్‌ (తమిళ, హిందీ) మూవీ మంచి విజయం అందుకుంది. తెలుగులో ఈ సినిమా 'గురు' టైటిల్‌తో వెంకీ హీరోగా విడుదలై ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత ఆమె నుండి వస్తున్న తాజా చిత్రంలో సూర్య హీరో కాగా, మోహన్‌బాబు కోసం ఓ ప్రత్యేకమైన పాత్రను డిజైన్‌ చేశారట. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న మోహన్‌బాబు ఈ సినిమాను ఓకే చేయడం విశేషమే. నిజానికి ఈ సినిమాని మోహన్‌బాబు చాలా కాలం క్రితమే ఓకే చేశారట. ఇప్పటికి ఆయన షూటింగ్‌లో పాల్గొనే సమయం వచ్చింది. తాజాగా చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో ఈ సినిమా షూటింగ్‌ జరగనుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS