పాతిక కోట్లు... రామ్‌కి ఇదే తొలిసారి.

మరిన్ని వార్తలు

రామ్ కెరీర్‌లోనే అతి పెద్ద హిట్టు కొట్టాడు `ఇస్మార్ట్ శంక‌ర్‌` రూపంలో. పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సినిమా ఇది. తొలిమూడు రోజులూ బాక్సాఫీసు దుమ్ము దులిపిన సినిమా ఇది. తొలి వారంలో దాదాపు 25 కోట్లు (షేర్‌) సాధించింది. రామ్ కెరీర్‌లో నే ఇది అత్య‌ధిక వ‌సూళ్లు. విడుద‌ల‌కు ముందే పూరి ఈ సినిమాని త‌క్కువ రేట్ల‌కు అమ్మేశాడు. దాంతో పంపిణీదారులు లాభ‌ప‌డుతున్నారు.

 

తొలి మూడు రోజుల‌కే పెట్టుబ‌డి మొత్తం తిరిగొచ్చింది. ఇప్ప‌టి వ‌ర‌కూ ఈ సినిమా 27 కోట్ల‌కు పైగానే సాధించింది. మంగ‌ళ‌, బుధవారాల‌లో వ‌సూళ్లు బాగా త‌గ్గాయి. రేపు `డియ‌ర్ కామ్రేడ్‌` విడుద‌ల అవుతోంది. దాంతో శుక్ర‌, శ‌నివారాలు `ఇస్మార్ట్ శంక‌ర్‌` వ‌సూళ్లు మ‌రింత డ‌ల్ అవుతాయి. `డియ‌ర్ కామ్రేడ్‌` కాస్త అటూ ఇటూ తేడా కొడితే మాత్రం... `ఇస్మార్ట్ శంక‌ర్‌` పుంజుకుంటుంది. హిట్ ద‌శ నుంచి సూప‌ర్ హిట్ ద‌శ‌లోకి అడుగుపెట్టిన ఇస్మార్ట్ శంక‌ర్ - బ్లాక్ బ్ల‌స్ట‌ర్ అవ్వాలంటే మాత్రం ఈ వారాంతంలో మంచి వ‌సూళ్లు రావాలి. అది విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమానే ఆధార‌ప‌డి ఉంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS