అందగాడు, పవర్‌ఫుల్ సినీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నోడు. డాన్సుల్లో అక్కినేని ఫ్యామిలీలోనే టాప్. ఈ జనరేషన్ హీరోలకు తగ్గ స్పీడున్నోడు. అయినా కానీ అఖిల్‌లో కనిపించాల్సిన వేగం కనిపించడం లేదు. సక్సెస్, ఫెయిల్యూర్ సంగతి పక్కన పెడితే, సినిమా తర్వాత సినిమా చేయలేకపోతున్నాడు. 'అఖిల్' తర్వాత చాలా గ్యాప్ తీసుకుని 'హలో' చేశాడు. కథల ఎంపికలో బోల్లా కొట్టేస్తున్నాడు. కొడుకును ఓ సారి లాంఛ్ చేశాడు నాగార్జున. రెండోసారి రీ లాంఛ్ చేశాడు. అయినా వర్కవుట్ కాలేదు.
ఈ సారి ఎలా ప్రమోట్ చేయాలనే యోచనలో నాగార్జున తాపత్రయపడుతుండగా, ఎలాంటి కాన్సెప్ట్ ఎంచుకోవాలనే దానిపై అఖిల్ మాత్రం ఎటూ తేల్చుకోలేకపోతున్నాడట. కొత్త కథలు వింటున్నాడు. కానీ తనకి తగ్గ సరైన కథని ఎంచుకోవడమే తెలీడం లేదు అఖిల్‌కి. అయినా కానీ హీరో అన్నాక, హిట్ కోసమే చేతులు కట్టుకుని కూర్చోకుండా, ఏదో ఒకటి వరుస సినిమాలు చేస్తూ, ప్రేక్షకులకు దగ్గరగా ఉండాలన్న విషయాన్ని అఖిల్ లైట్ తీసుకుంటున్నాడనే విమర్శలు కూడా తలెత్తుతున్నాయి.
కొత్త కొత్త దర్శకులు, కొత్త కొత్త కాన్సెప్ట్‌లతో దర్శకులు వస్తున్నారు. ఫస్ట్ అటెంప్ట్‌తోనే సైలెంట్‌గా హిట్ కొట్టేస్తున్నారు. కానీ అఖిల్ మాత్రం ఎందుకో గ్యాప్ మెయింటైన్ చేస్తున్నాడు. 'హలో' వచ్చి ఇన్నాళ్లు గడుస్తున్నా, అఖిల్ తదుపరి చిత్రం వివరాలు బయటికి రాలేదు. ఏది ఏమైనా ఎలాగోలా ఒక్క హిట్ కొడొతే చాలు అఖిల్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోతుంది. క్లాస్ మాస్ అనే తేడా లేకుండా, కంప్లీట్ ప్యాకేజ్‌లాంటి కుర్రోడు అని అఖిల్ గురించి చెప్పొచ్చు. ఆ హిట్ పడితే అఖిల్‌కి తిరుగుండదు. కానీ ఆ హిట్ పడేదెలా? జస్ట్ వెయిట్ అండ్ వాచ్.