ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వారసులకూ - సైరా టీమ్‌కూ విడుదలకు ముందు మినీ సైజు యుద్ధమే సాగింది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథని సినిమాగా తీస్తున్నందుకు తమకు రూ.5 కోట్లు ఇవ్వాలని, ఆ వంశస్థులు డిమాండ్ చేశారు. మరీ 5 కోట్లు అనేసరికి.. రామ్ చరణ్ కూడా వెనకడుగు వేశాడు. కొద్దో గొప్పో ఇవ్వాలని ప్రయత్నించినా.. కుదర్లేదు. దాంతో కోర్టు వరకూ వెళ్లింది వ్యవహారం. అయితే కోర్టు సైరా బృందానికి అనుకూలంగా తీర్పు చెప్పింది.
ఈ విషయంలో తాము కలగజేసుకునేది ఏమీ లేదని, సివిల్ కోర్టులో ఇలాంటి విషయాలు తేల్చుకోవాలని, విడుదల మాత్రం ఆపే ప్రసక్తి లేదని తేల్చేసింది. దాంతో ఈ కేసుని విత్ డ్రాచేసుకోవాల్సివచ్చింది. అయితే... సైరా టీమ్ మాత్రం ఉయ్యాలవాడ వంశస్థుల్ని వట్టి చేతులతో పంపలేదు. రూ.15 లక్షలు పరిహారంగా ఇచ్చిందట. ఉయ్యాలవాడలో ఉయ్యాలవాడ నరసింహారెఉడ్డి పేరు మీద కొన్ని సేవా కార్యక్రమాల్ని కూడా చేస్తామని మాటిచ్చార్ట. దాంతో ఉయ్యాలవాడ వంశస్థులు శాంతించారు.