ఇంత‌కీ కాజ‌ల్‌ని తేజ కొట్టాడా? లేదా?

By iQlikMovies - May 27, 2019 - 09:00 AM IST

మరిన్ని వార్తలు

తేజపై ఓ పాత రూమ‌ర్‌.. ఇప్ప‌టికీ వినిపిస్తుంటుంది. త‌న సినిమా అంటే.. హీరో, హీరోయిన్‌ల‌పై చేయి చేసుకోవ‌డం కామ‌న్ అనేది చిత్ర‌సీమ గ‌ట్టిగా న‌మ్మేమాట‌. ఆయ‌న చేతి దెబ్బ‌ల నుంచి త‌ప్పించుకున్నవాళ్లు ఒక్క‌రూ లేరని టాలీవుడ్ న‌మ్ముతుంది. కొత్త వాళ్ల‌తో సినిమాలు చేస్తున్న‌ప్పుడు తేజ చెంప‌దెబ్బ‌లు మ‌రింత ఘాటుగా ఉంటాయ‌ని అనుకుంటుంటారు. మ‌రి తేజ‌తో మూడు సినిమాలు చేసిన కాజ‌ల్ కూడా చెంప‌దెబ్బ తిందా? లేదా? అనే ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ టాలీవుడ్లో నడుస్తోంది.

 

'ల‌క్ష్మీ క‌ల్యాణం'తో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది కాజ‌ల్. ఇప్పుడంటే స్టార్ అయ్యింది గానీ, అప్ప‌టికి త‌ను కొత్తే క‌దా? అందుకే తేజ కూడా త‌న ప్ర‌తాపం చూపించార్ట‌. ఓ డాన్స్ మూమెంట్ స‌రిగా చేయ‌క‌పోతే... తేజ సెట్లోనే అంద‌రి ముందూ కోప్పడ్డార‌ని టాక్‌. అంతే కాదు... ఆ సినిమా హీరో క‌ల్యాణ్ రామ్ చేత‌... ఓ చెంప‌దెబ్బ వేయించార్ట‌. కాజ‌ల్ పై చేయి చేసుకోవ‌డం క‌ల్యాణ్ రామ్‌కి ఇష్టం లేక‌పోయినా తేజ బ‌ల‌వంతంపై ఓ దెబ్బ వేయాల్సివ‌చ్చింద‌ట‌.

 

'ల‌క్ష్మీ క‌ల్యాణం' సినిమాకి ప‌నిచేసిన ఓ కీల‌క సాంకేతిక నిపుణుడు ఈ విష‌యాన్ని ఇటీవ‌లే త‌న స‌న్నిహితుల ద‌గ్గ‌ర గుర్తు చేయ‌డంతో ఈ విష‌యం బ‌య‌టకు వ‌చ్చేసింది. ఆ సినిమా కాజ‌ల్ కి మంచి ఫ‌లితాన్నే తీసుకొచ్చింది. మ‌గ‌ధీర‌తో ఏకంగా స్టార్ హీరోయిన్ అయిపోయింది. నేనే రాజు నేనే మంత్రి, సీత సెట్లో మాత్రం కాజ‌ల్ ని తేజ ఓ స్టార్‌గానే చూసుకున్నాడ‌ట‌. అందుకే తేజ‌తో మ‌రోసారి ప‌నిచేయ‌డానికి కాజ‌ల్ సిద్ధ‌మైపోయింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS