డీజే టిల్లు సినిమాతో క్రేజీ స్టార్ డమ్ దక్కింది సిద్దు జొన్నలగడ్డకి. అప్పటి వరకు చాలా సినిమాలు చేసినా సిద్దు టాలెంట్ ఎవరూ గుర్తించలేదు. కానీ టిల్లు మూవీ సిద్దు కష్టానికి ప్రతి ఫలం దక్కేలా చేసింది. ఎవరి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీ కి వచ్చిన సిద్ధుకి టిల్లు గాడు కేరాఫ్ అడ్రస్ లా మారిపోయాడు. ఇప్పుడు ఈ మూవీకి సిక్వెల్ గా టిల్లు స్క్వేర్ వస్తోంది. సిద్ధుకి జోడిగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. ఈ మూవీ కోసం యూత్ ఈగర్లీ వెయిటింగ్. డీజే టిల్లుకి మించి టిల్లు స్క్వేర్ ఉంటుందని, ఇప్పటికే హింట్ ఇచ్చారు. దీనితో ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇన్ని అంచనాల మధ్య వస్తున్న ఈ మూవీ రైట్స్ కూడా రికార్డ్ స్థాయిలో అమ్ముడయ్యాయని సమాచారం. ఈ మధ్య కాలంలో చాలా సినిమాలకు సంబంధించి డిజిటల్ హక్కుల విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. చాలా OTT సంస్థలున్నా ఒకప్పటిలా మూవీస్ కొనుగోలు చేయటం లేదు. నెట్ ఫ్లిక్స్ ఒకటే ముందుకు వస్తోంది. ఎంతో కొంత క్రేజ్ ఉన్న సినిమాలకే పోటీ ఉంటోంది.సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై 45 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన టిల్లూ స్క్వేర్ సినిమా డిజిటల్ హక్కులను 35 కోట్లకి నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసిందని తెలుస్తోంది. డిజిటల్ రైట్స్ ద్వారా నే ఇంత పెట్టుబడి రావటం గమనార్హం.
టిల్లూ స్క్వేర్ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. కాకపోతే ఫాన్స్ కి ఒక్క అసంతృప్తి ఉండిపోయింది. ఇంత క్రేజ్ సొంతం చేసుకున్న ఈ మూవీని పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేస్తే బాగుంటుందని కామెంట్లు చేస్తున్నారు. మల్లిక్ రామ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ మార్చి 29న రిలీజ్ కానుంది. ఈ మూవీ థియేట్రికల్ హక్కులు కూడా భారీ మొత్తానికి అమ్ముడైనట్లు తెలుస్తోంది.