సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ సరసన ‘హీరో’ సినిమాలో నటించాల్సిన ముద్దుగుమ్మ మాళవికా మోహనన్. కానీ, ఈ సినిమా అనుకోకుండా మధ్యలోనే ఆగిపోవడంతో, ఈ మలయాళ కుట్టి టాలీవుడ్‌ని టచ్ చేసే ఛాన్స్ కోల్పోయింది. అయితే, ప్రస్తుతం తమిళంలో విజయ్ హీరోగా ‘మాస్టర్’ సినిమాలో నటిస్తోంది మాళవికా మోహనన్. అక్కడ తొలి సినిమాకే స్టార్ హీరోతో జత కట్టే ఛాన్స్ రావడంతో, మాళవికకు డిమాండ్ అమాంతం పెరిగిపోయిందట. రేపో మాపో ఒకవేళ టాలీవుడ్‌లో చేయాల్సి వచ్చినా రెమ్యునరేషన్ గట్టిగా డిమాండ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు.
అన్నీ కుదిరితే, మన రౌడీతో కలిసి ఈ పాటికే ఈ పాప ఎంట్రీ జరిగిపోయి ఉండేది. అయినా ఫర్వాలేదట. త్వరలోనే టాలీవుడ్‌లో ఓ బిగ్ ప్రాజెక్ట్‌తో మాళవికా ఆరంగేట్రం చేయనుందని తెలుస్తోంది. టాలీవుడ్‌లో ఓ స్టార్ హీరో సినిమా కోసం ఇప్పటికే మాళవికా మోహనన్‌తో సంప్రదింపులు జరుగుతున్నాయట. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఆ ప్రాజెక్ట్ రేపో మాపో కన్‌ఫామ్ అయ్యే అవకాశాలున్నాయని టాలీవుడ్ సమాచారం.