‘ఆర్‌ఎక్స్’ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్‌కి క్రేజ్ బాగానే ఉన్నా, ఎందుకో సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం ఆమె ఓ హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీలో నటిస్తోంది. ‘5 డబ్ల్యూస్’ అనే టైటిల్‌తో రూపొందుతోన్న ఈ సినిమాలో పాయల్ పవర్‌ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించనుంది. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్‌లుక్ కూడా రిలీజ్ చేశారు. అయితే, ఈ మధ్య పాయల్‌పై ఓ గాసిప్ చక్కర్లు కొడుతోంది. సీనియర్ హీరో అయిన విక్టరీ వెంకటేష్‌తో ఇప్పటికే పాయల్ నటించిన ‘వెంకీ మామ’ సూపర్ హిట్ కావడంతో, మరో సీనియర్ హీరో సరసన పాయల్ ఛాన్స్ దక్కించుకుందట.. అనేది ఆ గాసిప్ సారాంశం. ఆయన మరెవరో కాదు.
నందమూరి నటసింహం బాలయ్య బాబు. బాలయ్య, బోయపాటి శీను కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమాకి ఇంతవరకూ హీరోయిన్ ఫిక్స్ కాలేదు. ఆ ప్లేస్‌లోనే పాయల్ రాజ్‌పుత్ పేరు వినిపించింది. ఈ గాసిప్ విషయంలోనే పాయల్ రాజ్‌పుత్ తాజాగా క్లారిటీ ఇచ్చింది. బాలయ్య సినిమా కోసం ఇంతవరకూ తనను ఎవరూ సంప్రదించలేదని స్పష్టం చేసింది. ఒకవేళ అలాంటి ఆఫర్ దక్కితే డైరెక్ట్‌గా నేనే మీకు ఇన్‌ఫామ్ చేస్తా అంటూ ఫ్యాన్స్‌కి డైరెక్ట్ క్లారిటీ ఇచ్చేసింది పాయల్ రాజ్‌పుత్.