ప్రభాస్ కోసం పెద్ద ఆసుపత్రి రెడీ అవుతోంది!

By Inkmantra - August 05, 2020 - 16:33 PM IST

మరిన్ని వార్తలు

ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో 'రాధే శ్యామ్' అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 1960ల నేపథ్యంలో యూరోప్ లో జరిగే ఒక ప్రేమ కథ ఈ సినిమా అని ఇప్పటికే వార్తలు వచ్చాయి. 'రాధే శ్యామ్' టీమ్ ఇప్పటికే ఓ భారీ యూరోప్ షెడ్యూలు కూడా పూర్తి చేసింది. అయితే కరోనా వైరస్ కారణంగా షూటింగ్ ఓ నాలుగైదు నెలల క్రితం ఆగిపోయిన సంగతి తెలిసిందే.

 

తాజాగా ఈ సినిమా గురించి మరో అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ కోసం ఒక పెద్ద హాస్పిటల్ సెట్ ను రామోజీ ఫిలిం సిటీలో నిర్మిస్తున్నారట. మరో 20 రోజుల్లో ఈ హాస్పిటల్ నిర్మాణం పూర్తవుతుందని, షూటింగ్ చేసేందుకు రెడీగా ఉంటుందని సమాచారం. పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉంటే 'రాధే శ్యామ్' టీమ్ కొత్త షెడ్యూల్ ఈ హాస్పిటల్ సెట్లోనే మొదలు పెడతారట.

 

ఈ సెట్ కోసం నిర్మాతలు దాదాపు ఐదు కోట్లకు పైగా ఖర్చు చేశారని అంటున్నారు. కొన్ని కీలకమైన సన్నివేశాలతో పాటుగా యాక్షన్ ఎపిసోడ్ లు కూడా ఈ హాస్పిటల్ లోనే చిత్రీకరించాల్సి ఉందని అంటున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ కు జోడిగా పూజా హెగ్డే నటిస్తోంది. యువి క్రియేషన్స్, గోపి కృష్ణ మూవీస్ వారు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS