కరణం మల్లేశ్వరి పాత్రలో ఆ బ్యూటీ.

By Gowthami - August 05, 2020 - 16:00 PM IST

మరిన్ని వార్తలు

ఈ మధ్య అన్ని సినిమా ఇండస్ట్రీల్లో బయోపిక్ సినిమాల జోరు పెరుగుతోంది. తెలుగులో కూడా ఇప్పటికే పలు బయోపిక్ లు తెరకెక్కాయి. కొన్ని ప్లానింగ్ దశలో ఉన్నాయి. అలా ప్లానింగ్ దశలో ఉన్న బయోపిక్స్ లో కరణం మల్లేశ్వరి బయోపిక్ ఒకటి. ఒలంపిక్స్ లో పతకం సాధించిన తొలి మహిళా క్రీడాకారిణిగా కరణం మల్లేశ్వరి చరిత్ర సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే. ఆమె తెలుగువారు కావడం మనందరికీ గర్వకారణం. ఆమె కథను సినిమాగా తెరకెక్కించేందుకు జోరుగా సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకు ప్రముఖ రచయిత కోన వెంకట్ ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కరణం మల్లేశ్వరి సినిమా నిర్మిస్తున్నామని గతంలో కోన వెంకట్ అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ సినిమాలో కరణం మల్లీశ్వరి పాత్ర పోషించే నటి కోసం చాలా రోజులుగా వెతుకుతున్నారట. మొదట ఈ పాత్రకు తాప్సీ పన్ను అయితే బాగుంటుందని, సినిమాకు జాతీయ స్థాయిలో ఆదరణ దక్కుతుందని భావించి ఆమెను సంప్రదించారట.

 

అయితే వెయిట్ లిఫ్టర్ పాత్ర పోషించేందుకు కఠినమైన ఎక్సర్ సైజులు అవసరం అవుతాయి, శరీరాకృతి కూడా మార్చుకోవలసి ఉంటుంది. అందుకే ఈ పాత్ర పట్ల తాప్సీ పెద్దగా ఆసక్తి చూపలేదట. దీంతో నిర్మాతలు రకుల్ ప్రీత్ సింగ్ ను సంప్రదించారని, ఆమె కూడా ఈ సినిమాలో నటించేందుకు పచ్చజెండా ఊపిందని సమాచారం. రకుల్ ప్రీత్ సింగ్ ఒక ఫిట్నెస్ ఫ్రీక్ అనే సంగతి అందరికీ తెలిసిందే. రెగ్యులర్ గా ఎక్సర్ సైజులు చేయడంతోపాటు ఒక్కొక్కసారి తన ఎక్సర్సైజ్ వీడియోలను సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులతో పెంచుకుంటూ ఉంటుంది. అంతేకాదు ఎఫ్ 45 పేరిట ఒక జిమ్ ఫ్రాంచైజీ కూడా నడుపుతోంది.

 

ఫిట్నెస్ అంటే ప్రాణం కాబట్టి ఈ వెయిట్ లిఫ్టర్ పాత్రకు ఆమె ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం ఉండదు. మరో విషయం ఏంటంటే రకుల్ ఇంత సీరియస్ రోల్ ఎప్పుడూ చేయలేదు కాబట్టి తన కెరీర్లో ఇదొక ఒక మరపురాని చిత్రంగా మిగిలే అవకాశం కూడా ఉంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS