తొలి సినిమాకే కోటి రూపాయ‌లు ఇచ్చారా?

మరిన్ని వార్తలు

హీరోయిన్‌కి కోటి రూపాయ‌ల పారితోషికం అంటే ఇది వ‌ర‌కు `అమ్మో..` అనుకునేవారు. ఇప్పుడు స్టార్ హీరోయిన్లంతా కోటి, రెండు కోట్లూ తీసుకుంటున్నారు. వాళ్ల డిమాండ్ అలా ఉంది. ఒక్కో క‌థానాయిక‌కి 3, 4 కోట్లు ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. అవ‌న్నీ స‌ర్వ‌సాధార‌ణ‌మైన విష‌యాలు అయిపోయాయి. అయితే... తొలి సినిమాకే కోటి రూపాయ‌లు అందుకోవ‌డం అన్న‌ది నిజంగా సంచ‌ల‌న‌మే. అందులోనూ ఓ తెలుగు సినిమాకి. నాగ‌శౌర్య క‌థానాయ‌కుడిగా అనీష్ కృష్ణ కాంబినేష‌న్‌లో ఓ చిత్రం రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. ఐరా క్రియేష‌న్స్ నిర్మిస్తోంది.

 

ఇందులో క‌థానాయిక‌గా షెర్లీ సేఠియాని ఎంచుకున్నారు. ఇది త‌న‌కు తొలి సినిమా మాత్ర‌మే. అయితే అందుకోసం ఏకంగా కోటి రూపాయ‌ల పారితోషికం డిమాండ్ చేసింద‌ని స‌మాచారం. అడిగినంత ఇవ్వ‌డానికి చిత్ర‌బృందం ఒప్పుకున్న త‌ర‌వాతే.. త‌ను సంత‌కాలు చేసింద‌ట‌. తొలి సినిమాకే కోటి ఏంటి? అనే అనుమానం రావొచ్చు. కాక‌పోతే.. షెర్లీకి బాలీవుడ్ లో మంచి పేరుంది. త‌ను ఓ పాప్ సింగ‌ర్‌. అక్క‌డ యూ ట్యూబ్ ఛాన‌ల్ స్టార్‌. అందుకే ఈ స్థాయిలో పారితోషికం డిమాండ్ చేసింద‌ని టాక్‌. ఇటీవ‌ల తెలుగు సినిమాలు హిందీలో డ‌బ్ అయి వెళ్తున్నాయి.

 

షెర్లీ ఉంటే.. డ‌బ్బింగ్ హ‌క్కుల రూపంలో మ‌రింత ఎక్కువ మొత్తం లాగొచ్చ‌న్న‌ది నిర్మాత‌ల ఉద్దేశ్యం కాబోలు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS