దేశం కోసం రాఖీ సావంత్‌ హాట్‌ కామెంట్‌.!

మరిన్ని వార్తలు

హాట్‌ హాట్‌ వీడియోలతో స్కిన్‌ షోలకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే హాట్‌ ఐటెం బాంబ్‌ రాఖీ సావంత్‌ కూడా తన దేశభక్తిని చాటేసుకుంది. ప్రస్తుతం ఇండియా పాకిస్థాన్‌ దేశాల మధ్య నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో రాఖీ సావంత్‌ తాజాగా ఓ కామెంట్‌ చేసింది. దేశం కోసం తన ప్రాణాలివ్వడానికి సిద్ధమని స్టేట్‌మెంట్‌ ఇచ్చింది. 50 నుండి 100 బాంబులు తీసుకుని ఉగ్రశిబిరాలపై దాడి చేసి శత్రువులను మట్టుబెట్టి తిరిగొస్తానని చెప్పింది. 

 

రాఖీ వ్యాఖ్యలపై మిశ్రమ కామెంట్లు వస్తున్నాయి. పబ్లిసిటీ అంటే పిచ్చ ఉన్న రాఖీ సావంత్‌ ఏది ట్రెండింగ్‌లో ఉంటే దాన్ని పట్టుకుని తనదైన శైలిలో ఆపాదించేసుకుని పబ్లిసిటీ స్టంట్‌కి సిద్ధమైపోతుంది. మొన్నీ మధ్య ఓ రెజ్లర్‌తో పోటీకెళ్లి నడుం విరగ్గొట్టుకుని వార్తల్లోకెక్కిన రాఖీ సావంత్‌ తాజాగా పంజాబ్‌లో ఓ కార్యక్రమానికి హాజరైంది. అందులో భాగంగా ఈ తాజా వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచింది. 

 

శత్రువుల చెరలో బంధీగా ఉన్న భారత్‌ వైమానికదళ వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ క్షేమంగా తిరిగి రావాలని దేవుణ్ని ప్రార్ధిస్తున్నానని రాఖీ సావంత్‌ తెలిపింది. పుల్వామా దాడి ఘటన తర్వాత శత్రువులకు మోడీ సరైన సమాధానమే చెప్పారనీ ప్రధానమంత్రి మోడీని సమర్ధిస్తూ ఆయనపై ప్రశంసల జల్లు కురిపించింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS