తమిళ హీరో విశాల్ ఈ మధ్య కాలంలో హీరోగానే కాకుండా తమిళ చిత్రసీమలో జరిగిన నడిగర్ సంఘం ఎలక్షన్స్ వల్ల బాగా పాపులర్ అయ్యాడు.
అయితే తనకి మాజీ నడిగర్ సంఘం అధ్యక్షుడైన్ శరత్ కుమార్ జరిగిన మాటల యుద్ధం అందరికి విదితమే. ఇదంతా సమసిపోయింది అనుకుంటే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎలక్షన్స్ లో విశాల్ అధ్యక్ష పదవకి పోటీ చేస్తున్నాడని తెలిసి కొంతమంది అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు.
చివరికి మద్రాస్ హైకోర్ట్ తీర్పు విశాల్ కి ఊరట ఇచ్చింది. నిన్నటి రోజు విశాల్ మార్చ్ 5న జరగబోయే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎన్నికలకు అద్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేశాడు. ఆసక్తికర విషయమేమిటంటే విశాల్ కి లోకనాయకుడు కమల్ హసన్ మద్దతు పలికాడు. అంతేకాక తన సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ తరుపున విశాల్ కి మద్దతు తెలియ చేశాడు.