క్రిస్మస్‌కి ఫిక్సయిన యంగ్‌ హీరో.!

మరిన్ని వార్తలు

కిస్మ్రస్‌ పండక్కి డేట్‌ ఫిక్స్‌ చేసుకున్నాడు ఎనర్జిటిక్‌ హీరో రాజ్‌ తరుణ్‌. ఈయన నటిస్తున్న 'ఇద్దరి లోకం ఒకటే' చిత్రం డిశంబర్‌ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై రాజుగారి హస్తం ఉంది. దిల్‌ రాజు బ్యానర్‌లోనే ఈ సినిమా రూపొందింది. దిల్‌రాజు - రాజ్‌ తరుణ్‌ కాంబినేషన్‌లో వచ్చిన రెండో చిత్రమిది. మొదటి చిత్రం 'లవర్‌' అంచనాలు అందుకోలేకపోయింది. కానీ, ఈ చిత్రంపై ఓ మోస్తరు అంచనాలున్నాయి. అందులోనూ రాజ్‌ తరుణ్‌ని హీరోగా నిలబెట్టిన 'ఉయ్యాలా జంపాలా' సినిమా అదే రోజు విడుదల కావడంతో, సెంటిమెంట్‌ పరంగా కూడా ఈ సినిమాపై అంచనాలు నమోదయ్యాయి.

 

చాలా కాలంగా రాజ్‌తరుణ్‌ ఖాతాలో హిట్‌ పడలేదు. సో ఈ సినిమాతో రాజ్‌తరుణ్‌ మళ్లీ ఫామ్‌లోకి రావాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ సినిమాని చాలా ప్రెస్టీజియస్‌గా తీసుకున్నాడట రాజ్‌ తరుణ్‌. హీరోయిన్‌గా షాలినీ పాండే ఈ సినిమాకి మరో ప్రధాన ఆకర్షణ. 'అర్జున్‌ రెడ్డి'తో హిట్‌ కొట్టిన షాలినీ పాండే లక్కీ బ్యూటీ అనిపించుకుంది. ఆ తర్వాత గెస్ట్‌ రోల్‌ పోషించిన 'మహానటి' సూపర్‌ హిట్‌ అయ్యింది. నందమూరి హీరోకి '118'తో మంచి హిట్‌ ఇచ్చింది. ఇప్పుడు రాజ్‌తరుణ్‌కీ 'ఇద్దరి లోకం ఒకటే' రూపంలో హిట్‌ దక్కుతుందని ఆశిస్తున్నారు. జి.ఆర్‌.కృష్ణ ఈ సినిమాకి దర్శకుడు. మిక్కీ.జె.మేయర్‌ కూల్‌ అండ్‌ రొమాంటిక్‌ మ్యూజిక్‌ అందించాడు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS