యంగ్ హీరో రాజ్ తరుణ్, షార్ట్ బ్యూటీ షాలిని పాండే హీరో హీరోయిన్స్ గా ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో రాబోతున్న చిత్రం 'ఇద్దరి లోకం ఒకటే'. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న ఈ సినిమాను విడుదల కానుందని దర్శక నిర్మాతలు పోస్టర్ ను రిలీజ్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు కూడా. అయితే ఈ సినిమాకు మాత్రం ఉండాల్సిన స్థాయిలో అంచనాలు లేవు.
దిల్ రాజు సినిమా అనగానే ఆడియన్స్ లో పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది. కానీ ఎందుకో మొదటినుంచీ 'ఇద్దరి లోకం ఒకటే'ను ఆడియన్స్ పెద్దగా పట్టించుకోవట్లేదు. కానీ బజ్ సినిమాకి లేకపోయినా ఈ సినిమా సాంగ్స్ కు మాత్రమే బాగానే ఉంది. మిక్కి జే మేయర్ సంగీత దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పాటలు యూత్ లో మంచి ఆదరణ దక్కించుకుంటూ సూపర్ హిట్ గా నిలిచాయి. కాగా రీసెంట్ గా హిట్ అయిన సాంగ్స్ టాప్ టెన్ లిస్ట్ చూస్తే.. సామజవరగమనా తర్వాత రెండవ స్థానంలో ఈ సినిమా సాంగ్స్ నిలవడం నిజంగా విశేషంమే.
మ్యూజిక్ హిట్ అయ్యిందంటే సగం సినిమా హిట్ అయ్యినట్టే అంటారు. మరి ఈ సినిమాలోని మేలోడియస్ యూత్ కి నచ్చేలా ఉన్నాయి. సోషల్ మీడియాలో పాజిటివ్ కామెంట్స్ పెడుతున్నారు నెటిజెన్స్. మరి సాంగ్స్ వల్లనైనా 'ఇద్దరిలోకం ఒకటే' సినిమాకి మంచి పాజిటివ్ బజ్ వస్తోందేమో చూడాలి. ఎలాగూ రాజ్ తరుణ్ కు హిట్ వచ్చి చాలా కాలమే అయిపోయింది. మరి ఈ సినిమాతోనైనా రాజా తరుణ్ కి మంచి హిట్ రావాలని ఆశిద్దాం.