స్వీటీ అనుష్క గత సంవత్సరం భాగమతిగా ప్రేక్షకుల ముందుకొచ్చి సప్సెన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఓ రేంజ్ లో భయపెట్టింది. మొత్తానికి హారర్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. ముఖ్యంగా భాగమతి సినిమాలో అనుష్క నటన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దర్శకుడు అశోక్ ఈ సినిమాని ఓ భిన్నమైన కథాంశంతో హారర్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కించారు.
ఈ సినిమా బాలీవుడ్ లో రీమేక్ కానున్న సంగతి తెలిసిందే. ఎప్పటినుండో భాగమతి సినిమా హిందీలో రీమేక్ కానుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎట్టకేలకు అందుకు ఇటీవలే రంగం సిద్ధం అయింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. మరి అనుష్క 'భాగమతి' 'దుర్గావతి'గా హిందీ ప్రేక్షకులను ఆకట్టుకుందో లేదో చూడాలి.