శ్రీకాంత్, సుమంత్ అశ్విన్, భూమిక, తాన్యా హోప్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఇదే మా కథ’. గురు పవన్ దర్శకత్వం. జి. మహేష్ నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబరు 2న థియేటర్స్‌లో విడుదల కానుంది. ఇప్పటి వరకూ పెద్దగా ప్రమోషన్స్ లేని ఈ సినిమా ట్రైలర్ ని ఈ రోజు విడుదల చేశారు. నాలుగురి కథల సమాహారంగా ఈ సినిమాని తెరకెక్కించారని ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. నలుగురు బైక్ రైడర్ల కథ ఇది. ఒకొక్కరిది ఒకొక్క నేపద్యం. అందరూ ఒక జర్నీలో కలుస్తారు. మరి వారి కధలకు ఎలాంటి ముగింపు వుంటుందో ఇదే మా కధ చూస్తే తెలుస్తుంది.
శ్రీకాంత్ భూమిక లాంటి సినియర్లు వుండటం, సుమంత్ అశ్విన్ లాంటి యంగ్ హీరో వారికీ తోడవ్వడం సినిమాపై కాస్త ఆసక్తిని పెంచుతుంది. ఈ వారం కేవలం 'రిపబ్లిక్' పైనే ద్రుష్టి వుంది. ఇదే మా కధకి కొంచెం పాజిటివ్ టాక్ వచ్చినా కాస్త ప్రేక్షకులు ఇటు చూసే అవకాశం వుంది. శ్రీకాంత్, సుమంత్ అశ్విన్, భూమిక .. ఎవరికీ కూడా కొన్నాళ్ళుగా చెప్పుకోదగ్గ సినిమాలు లేవు. అందుకే ఈ సినిమాపై కూడా పెద్ద అంచనాలు లేవు. అంచనాలు లేకుండా విజయం సాధించిన సినిమాలు వుంటాయి. ఇదే మా కధకు కూడా అలాంటి ఫలితమే దక్కితే ఇంక కావాల్సింది ఏముంది.