గోవా బ్యూటీ ఇలియానాకి తెలుగు ప్రేక్షకులు పట్టం కట్టారు. తెలుగులో స్టార్ హీరోలందరి సరసన నటించిన, నెంబర్ వన్ హీరోయిన్ అనిపించుకుంది ఈ ముద్దుగుమ్మ. అయితే గత కొంత కాలంగా ఇలియానా తెలుగులో సినిమాలు చేయడం లేదు. దీనికి కారణం ఏంటంటే హిందీ సినిమాలతో ఇల్లీ బేబీ బిజీగా ఉండటం వల్లేనట. ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్ ఆండ్రూతో ప్రేమలో ఉంది ప్రస్తుతం ఇలియానా. ప్రేమ సరే, పెళ్ళి గురించి మాత్రం మాట్లాడకూడదట. ఇలియానా అందంగా ఉంటుంది. ఈ సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇలియానాని ఇంకా అందంగా చూపించడంలో ఆండ్రూ దిట్ట. ఇలియానా బికినీ పోజులకు ఆయనే పెర్ఫెక్ట్ ఫొటోగ్రాఫర్. ఆమెకు మంచి స్నేహితుడు, బాయ్‌ఫ్రెండ్, లవర్ అని మాత్రమే చెబుతూ, భర్త అన్న ప్లేస్ గురించి ఆలోచించలేదని, అతనికి ఇంకా ఆ అవకాశం ఇవ్వలేదని ఇలియానా వివరించింది. ఒకప్పుడు తెలుగులోనూ, తమిళంలోనూ సినిమాలు చేసినప్పటికీ ఇప్పుడు అటు వైపుకు వెళ్ళలేకపోతున్నానని ఇలియానా చెప్పింది. ప్రత్యేకమైన కారణాలేమీ లేవని ఆమె చెబుతున్నప్పటికీ కూడా తెలుగులో కొన్ని సినిమాలకు ఇలియానా ఇచ్చిన ఝలక్‌తో ఆమెను టాలీవుడ్ పక్కన పెట్టేసిందనుకోవచ్చు. ఏదేమైనా హిందీలో ఇలియానా ఫుల్ బిజీ. ప్రస్తుతం ఆమె నటిస్తున్న 'ముబారకన్', 'బాద్షాహో' సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. రెండూ పెద్ద సినిమాలే.