అప్పట్లో తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఇలియానా కెరీర్ ఇప్పుడు దాదాపుగా చివరిదశలో ఉంది. బాలీవుడ్ లో అవకాశాలు తగ్గిపోయాయి. తెలుగులో రవితేజ సినిమా 'అమర్ అక్బర్ ఆంటోనీ' సినిమాతో రీ-ఎంట్రీ ఇచ్చింది కానీ అది నిరాశపరచడంతో టాలీవుడ్ లో ఇక పర్మనెంట్ గా దారులు మూసుకుపోయాయని అందరూ అనుకున్నారు. కానీ ఈ గోవా భామకు టాలీవుడ్ లో మరో అవకాశం వచ్చిందని టాక్. అక్కినేని నాగార్జున తాజాగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.
బాలీవుడ్లో సూపర్ హిట్ అయిన 'రెయిడ్' సినిమాకు రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని అంటున్నారు. ఒరిజినల్ సినిమాలో హీరోయిన్ గా నటించిన ఇలియానానే రీమేక్ లో కూడా హీరోయిన్ గా తీసుకోవాలని ఫిక్స్ అయ్యారట. నిజానికి ఈమధ్య సీనియర్ స్టార్ హీరోలకు హీరోయిన్లను వెతకడం కష్టంగా మారింది. ఇలాంటి సమయంలో ఇలియానాను హీరోయిన్ గా ఎంచుకోవడం తెలివైన నిర్ణయం అని చెప్పుకోవచ్చు. నాగార్జున ప్రస్తుతం ఆహిషోర్ సాలమన్ దర్శకత్వంలో 'వైల్డ్ డాగ్' అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా పూర్తి కాగానే ఈ 'రెయిడ్' రీమేక్ ను పట్టాలెక్కిస్తారట. ఈ సినిమాతో అయినా ఇలియానా తన కెరీర్ లో తిరిగి పుంజుకుంటుందా అనేది వేచి చూడాలి.