ఇలియానా అది మాత్రం చెయ్యనంటోంది.!

మరిన్ని వార్తలు

గోవా బ్యూటీ అంటే ఇలియానా అంటే సన్నజాజి నడుముకు కేరాఫ్‌ అడ్రస్‌. కానీ ఆ సంగతి ఈ ముద్దుగుమ్మ మర్చిపోయిందో ఏమో కానీ, సెకండ్‌ ఇన్నింగ్స్‌లో ఆ నాజూకు నడుమును నడుము మడతల్లో దాచేసి, బొద్దుతనాన్ని బయటికి లాగేసింది. దాంతో సన్న నడుము ఇలియానాపై భారీగా విమర్శలు వెల్లువెత్తాయి. ఎలాగోలా రవితేజ సరసన ఛాన్స్‌ దక్కించుకుంది కానీ, ఇంకో అవకాశం ఆమె చెంత చేరేలా లేదు. దాంతో ఇలియానా యూ టర్న్‌ తీసుకోక తప్పదేమో అనుకున్నారంతా. కానీ ఇలియానా ఇంకోలా ఆలోచించింది.

 

హీరోయిన్‌ సెంట్రిక్‌ మూవీస్‌కి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ కథలేమైన ఉంటే తన వద్దకు రావచ్చని సంకేతాలు పంపిస్తోంది. అయితే ఫిజిక్‌ సంగతేంటంటే, ఫిజిక్‌పై ఇప్పుడు పెద్దగా కాన్‌సన్‌ట్రేషన్‌ చేసే యోచన ఇలియానా చేయట్లేదనీ తెలుస్తోంది. బక్క పలచని బాడీతో వయసు బయటపడిపోతుందని భావిస్తుందో ఏమో కానీ, బొద్దుతనంలోనే ముద్దుతనాన్ని ఆశిస్తోంది ఇలియానా. ఏది ఏమైనా ఇప్పుడు ఇలియానా పరిస్థితి ఇటు టాలీవుడ్‌కీ కాక, అటు బాలీవుడ్‌కీ కాక అన్నట్లుగా అయిపోయింది.

 

ఇదిలా ఉంటే, రవితేజ నటిస్తున్న మరో సినిమాలోనే ఇలియానాకి ఇంకో ఛాన్స్‌ దక్కిందనీ సమాచారమ్‌. అయితే ఈ సారి మాత్రం హీరోయిన్‌గా కాదట. జస్ట్‌ గెస్ట్‌ రోల్‌లోనే రవితేజ సినిమాలో ఇలియానా నటిస్తోందనీ విశ్వసనీయ వర్గాల సమాచారమ్‌. మొత్తానికి సెకండ్‌ ఇన్నింగ్స్‌ అయితే స్టార్ట్‌ చేసింది. కానీ త్రిష తదితర ముద్దుగుమ్మల్లా సెకండ్‌ ఇన్నింగ్స్‌లో ఇలియానా సక్సెస్‌ అవుతుందో లేదో ప్రస్తుతానికి సస్పెన్సే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS