బ్రేకప్ చెప్పినా కూడా ఇల్లీ బేబీని వదిలి పెట్టడం లేదు. లవ్ చేసుకోవడం, కొన్నాళ్లు రిలేషన్‌షిప్‌ని ఎంజాయ్ చేయం, ఆ తర్వాత బ్రేకప్ చెప్పేసుకోవడం.. తదితర అంశాలు ఈ రోజుల్లో చాలా కామన్. సెలబ్రిటీల విషయంలో అయితే అది మరీ కామన్ అయిపోయిందిప్పుడు. బ్రేకప్ చెప్పేసుకున్నాక ఎవరి దారిన వారు కెరీర్‌లో బిజీ అయిపోతున్నారు. కానీ, పాపం ఇలియానా పరిస్థితే అందుకు భిన్నంగా మారింది.
బ్రేకప్ తర్వాత కూడా ఇల్లీ బేబ్‌పై దుష్ప్రచారం తగ్గడం లేదు. డబ్బుల కోసమే ఇలియానా, ఆండ్రూ విడిపోయారంటూ ఆమె పరువు బజారుకీడ్చేస్తోంది సోషల్ ఫాలోయింగ్. పెళ్లి తర్వాత ఇలియానా సాధారణ గృహిణిలా లైఫ్ లీడ్ చేయాలనుకుందనీ, సినిమాలూ, కెరీర్ అనే తలనొప్పి ఫీలవకూడదనుకుందనీ, కానీ, మొదట్లో దీనికి ఒప్పుకున్న ఆండ్రూ ఆ తర్వాత డబ్బుల కోసం ఇలియానాని వేధించేవాడనీ నెట్టింట్లో ప్రచారం జరుగుతోంది. అయితే, ఇందులో నిజమెంతో తెలీదు కానీ, ఇలియానా మాత్రం ఈ ప్రచారంతో చాలా హర్ట్ అవుతోందట. ఆ ఒత్తిడి నుండి రిలీఫ్ అయ్యేందుకు మళ్లీ సినిమాల్లోకి రావాలనుకుంటోందట.
అయితే, అవకాశాలు వరించాలి కదా. అందుకే ఇల్లీ బేబీ మునుపటి తన అందాన్ని, ఫిజిక్‌ని తిరిగి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోందనీ తెలుస్తోంది. తనకిష్టం లేకున్నా, మళ్లీ ఫిజిక్‌పై కాన్‌సన్‌ట్రేషన్ చేసి, అవకాశాల కోసం ఎదురు చూపులు చూస్తోందట. పాపం ఇలియానా పరిస్థితిని అర్ధం చేసుకుని ఆమెకు మన దర్శక, నిర్మాతలు అవకాశాలిస్తారా.? అయినా ఒక్కసారి దృష్టి పెడితే, ఇలియానా బరువు తగ్గడం ఏమంత కష్టమైన పనే కాదు. నిజం చెప్పాలంటే, ఫిగర్‌లో ఇలియానాకి సాటి మరొకరు లేరంతే.