గోవా బ్యూటీ ఇలియానాకి తెలుగులో అవకాశాలు రావడం మానేసి చాలా కాలమే అయ్యింది. అయితే ఎలాగోలా 'అమర్ అక్బర్ ఆంటోనీ' సినిమాతో అవకాశం దక్కించుకుంది. అయితే ఆ సినిమా రిజల్ట్ రివర్స్ అవడంతో మళ్లీ ఇలియానాని పక్కన పెట్టేశారు టాలీవుడ్ జనం. ఇప్పుడు బాలీవుడ్‌లో ఇలియానా ఓ సినిమాలో నటిస్తోంది. తెలుగులో మరే కొత్త సినిమా ఒప్పుకోలేదు.
ఈ విషయం అటుంచితే, ఇలియానా ఇకపై గ్లామరస్ పాత్రల్లో నటించకూడదని డిసైడ్ అయిపోయిందట. హీరోయిన్ అంటే పాటలకే పరిమితం అనే పాత్రల్ని ఎంత ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చినా ఒప్పుకోనని తెగేసి చెప్పేసింది. హీరోయిన్ ప్రాధాన్యత ఉన్న పాత్రల్నే ఎంచుకుంటుందట. అయితే ఇది కేవలం టాలీవుడ్‌కి మాత్రమే. ఎందుకంటే టాలీవుడ్ సినిమాల్లోనే హీరోయిన్స్ పరిస్థితి ఈ రకంగా ఉంటుంది. బాలీవుడ్‌లో ఎలాగూ హీరోయిన్స్‌కి కూడా ఎంతో కొంత ఇంపార్టెన్స్ ఉంటుంది.
అందుకే బాలీవుడ్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నాను అనే అర్ధం వచ్చేలా ఇలియానా చెబుతోంది. మంచి కథ, కథలో తన పాత్ర నచ్చితేనే ఇకపై తెలుగు సినిమాలు ఒప్పుకుంటుందట. నాజూకు నడుముతో హీరోల సరసన గ్లామర్ లుక్స్‌లో చలాకీగా చిందేసి కనిపించిన ఇలియానా ఇప్పుడు గ్లామర్‌కి నో అనేయడం వెనక కారణాలేమున్నాయో ఏమో ఆమెకే తెలియాలి.