ఎక్స్‌పోజింగ్‌పై స్పందించిన 'మలర్‌' బ్యూటీ.!

మరిన్ని వార్తలు

కమర్షియల్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకోవాలంటే ఎక్స్‌పోజింగ్‌ తప్పనిసరి. అయితే ఏమాత్రం ఎక్స్‌పోజింగ్‌ లేకుండా ఓన్లీ టాలెంట్‌తో రాణిస్తున్న ముద్దుగుమ్మలు కూడా ఈ తరంలో ఉన్నారు. వారిలో ప్రస్తుతం సాయి పల్లవిదే హవా. టాలెంట్‌నే నమ్ముకుంటూ ఎక్స్‌పోజింగ్‌కి దూరంగా సక్సెస్‌ అవుతోన్న సాయిపల్లవి తాజాగా ఎక్స్‌పోజింగ్‌ విషయమై తనదైన స్పందన ఇచ్చింది. ఎక్స్‌పోజింగ్‌ తన బాడీకి సూట్‌ కాదనీ, ఇప్పుడే కాదు, ఎప్పుడూ ఎక్స్‌పోజింగ్‌కి తాను దూరమేననీ సాయిపల్లవి చెప్పుకొచ్చింది.

అలా అని ఎక్స్‌పోజింగ్‌ చేసేవారిని తాను విమర్శించనని కూడా చెప్పింది. తాజాగా సాయిపల్లవి తెలుగులో 'పడి పడి లేచె మనసు' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా హిట్టా.? ఫట్టా.? అనే విషయం పక్కన పెడితే, హీరోయిన్‌గా సాయిపల్లవి, హీరోగా శర్వానంద్‌ల యాక్టింగ్‌ చూసేందుకైనా ధియేటర్‌కెళ్లాలి అనే టాక్‌ అయితే బయటికి వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హీరో శర్వానంద్‌ నుండి క్లీన్‌ సర్టిఫికెట్‌ అందుకుంది సాయిపల్లవి. ఇదిలా ఏంటే సాయిపల్లవికి అనవసరమైన రూమర్స్‌ కూడా ఎక్కువే. అయినా వాటిని అస్సలు పట్టించుకోదీ మలర్‌ బ్యూటీ.

ఏది ఏమైనా సాయిపల్లవి టాలెంటెడ్‌ అన్న మాట వాస్తవం. సక్సెస్‌ అనేది ఓ లెవల్‌కొచ్చిందంటే ఇవన్నీ సముద్రంలో కాకిరెట్టలా కొట్టుకెళ్లిపోతాయంతే. సాయిపల్లవిది కూడా అదే ఆటిట్యూడ్‌. వరుస పెట్టి హడావిడిగా సినిమాలు చేసేయాలనే ఆలోచన తనకు లేదంటోంది. ఆలస్యమైనా మంచి కథల్ని, ప్రాధాన్యత ఉన్న పాత్రల్ని మాత్రమే ఎంచుకుంటానంటోంది. తమిళంలో విడుదలైన 'మారి 2' కూడా సాయిపల్లవికి మంచి గుర్తింపు తీసుకొచ్చింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS