నాగార్జున - ప్రవీణ్ సత్తారు కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న చిత్రం `ది ఘోస్ట్`. ఇందులో కాజల్ కథానాయిక. అయితే ఇప్పుడు ఆమె ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. కాజల్ ఇప్పుడు గర్భవతి. అందుకే ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని చిత్రబృందానికి చెప్పేసింది కాజల్. దాంతో మరో కథానాయికని వెదికి పట్టుకునే పనిలో పడింది చిత్రబృందం. ఈ అవకాశం ఈసారి ఇలియానాకి దక్కుతుందని ఇన్సైడ్ వర్గాల టాక్. నాగార్జునతో ఇలియానా ఇప్పటి వరకూ నటించలేదు. అందుకే ఇలియానా పేరు దాదాపు ఖాయమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కాకపోతే ఇల్లూ బేబీ ఇప్పుడు లావెక్కింది. సినిమాలపై పెద్దగా ధ్యాస లేదు. అదొక్కటే మైనస్. ఒకవేళ ఇలియానా ఓకే అంటే తనే ఈ ప్రాజెక్టులోకి వచ్చే అవకాశం ఉంది.
మరోవైపు త్రిష పేరు కూడా చర్చల్లో ఉంది. నాగ్ - త్రిష ఇద్దరూ కలిసి ఇది వరకు `కింగ్`లో నటించారు. వాళ్లది సూపర్ హిట్ జోడీనే. పైగా త్రిష ఫిజిక్ ఇప్పటికీ పర్ఫెక్ట్ గా ఉంది. తనుంటే తమిళ మార్కెట్ కీ ప్లస్ అవుతుందన్నది ఆలోచన. ముందు ఇలియానాని సంప్రదించి, తాను కాదన్న పక్షంలో... ఈ ఆఫర్ ని త్రిష దగ్గరకు తీసుకెళ్లాలని చిత్రబృందం భావిస్తోంది. సో.. వీరిద్దరిలో ఒకరు ఖాయమన్నమాట.