బెల్లీ బేబీ ఇలియానా గత కొంతకాలంగా ఫిజీ బ్రాండ్ అంబాసిడర్‌గా పని చేస్తోంది. వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ, బికినీల్లో పోజులిస్తూ, ఆమె చేసే ఈ హంగామా అంతా ఆ దేశాన్ని ప్రపంచం మొత్తం ప్రమోట్ చేయడంలో భాగమే. చేపపిల్లలా స్విమ్ సూట్‌లో హాట్ హాట్ పోజులిచ్చినా, అందమైన బీచ్‌ల్లో అందాలారబోయడంతో పాటు, హాట్ యాంగిల్స్‌లో యోగా చేసినా ఇవన్నీ ఆందుకోసమేనట. ఇలా చేస్తున్నందుకు ఫిజీ గవర్నమెంట్ నుండి ఆమెకు భారీ మొత్తంలో రెమ్యునరేషన్ అందుతోందనీ టాక్ వినిపిస్తోంది.
అయితే అదే విషయం ఆమెని అడిగితే, అబ్బే అలాంటిదేం లేదు. నేను ఫ్రీగానే ఫిజీకి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నానని చెబుతోంది. అయితే ఆడవారి మాటలకు అర్ధాలే వేరులేలా ఇలియానా మాటలకు అర్ధాలు బోలెడయా అనుకోవాల్సి వస్తోంది. ఎందుకంటే, రెమ్యునరేషన్ విషయంలోనే కాదు, ఇంకా చాలా చెబుతోందీ బెల్లీ బ్యూటీ. ఫిజీకి ప్రచారం చేయడంతో పాటు, అక్కడ మన ఇండియన్ సంస్కృతిని కూడా ప్రతిబింబించేలా చేస్తున్నానని చెబుతోంది. ఇండియన్ సంస్కృతి అంటే ఇలా బికినీల్లో పోజులివ్వడమా? అని ముక్కున వేలేసుకుంటున్నారు నెటిజన్లు.
కానీ ఇలియానా చెబుతోంది కదా నమ్మాల్సిందే. అయితే ఫిజీకి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడం 100 పర్సెంట్ నిజమే కానీ, ఫ్రీగా చేస్తున్నానన్నది మాత్రం అస్సలు నిజం కాదనే చెప్పాలి. ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన ఇలియానాకి ఇప్పుడంత సీను లేదు.
సో ఎలాగోలా తన ఉనికిని చాటుకునేందుకు సర్వ ప్రయత్నాలు చేస్తోంది. ఎలాగోలా వార్తల్లో నిలవాలనుకుంటోంది అందాల ఇలియానా. అదీ సంగతి.