నాగ్ తో ఇలియానా?

By Gowthami - July 31, 2020 - 11:00 AM IST

మరిన్ని వార్తలు

ఇలియానా మ‌ళ్లీ రీ ఎంట్రీ ఇవ్వ‌బోతోంద‌ని గ‌త కొంత‌కాలంగా వార్త‌లొస్తున్నాయి. టాలీవుడ్ లో అడుగుపెట్ట‌డానికి మంచి కాంబినేష‌న్ కోసంఎదురు చూస్తోంద‌ని ప్ర‌చారం జరిగింది. అది నిజ‌మే. ఇలియానా ప్లానింగ్ ఫ‌లించింది. ఇప్పుడు ఓ ఆఫ‌ర్ కూడా అందిన‌ట్టు టాక్‌.

 

నాగార్జున క‌థానాయ‌కుడుగా ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం తెర‌కెక్కుతోంది. ఇందులో ఇలియానాని క‌థానాయిక‌గా ఎంచుకున్న‌ట్టు స‌మాచారం. ఇదో యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌. క‌థానాయిక పాత్ర కూడా టామ్ బోయ్‌లా ఉండాల‌ట‌. అందుకోస‌మే ఇలియానానికి ఎంచుకున్న‌ట్టు స‌మాచారం. నాగ్ - ఇలియానా జోడీ కూడా బాగానే ఉంటుంది. దేవ‌దాస్ త‌ర‌వాత‌.. నాగ్ - ఇలియానా జంట‌గా ఓ సినిమా అనుకున్నారు. అప్ప‌ట్లో కుద‌ర్లేదు. ఇప్పుడు సాధ్య‌మైంది. మ‌రి ఈ రీ ఎంట్రీలో ఇలియానా ఎంత వ‌ర‌కూ స‌క్సెస్ అవుతుందో చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS