రాకీ భాయ్ వెర్సస్ ఆధీరా మోతెక్కిపోతుందట!

By Inkmantra - July 31, 2020 - 13:00 PM IST

మరిన్ని వార్తలు

ప్రస్తుతం సెట్స్ పైన ఉన్న పాన్ ఇండియా క్రేజీ సినిమాలలో 'కెజిఎఫ్: చాప్టర్ 2' ముఖ్యమైనది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా రూపొందిన 'కెజిఎఫ్: చాప్టర్ 1' ఘన విజయం సాధించడంతో సెకండ్ పార్ట్ పై అందరికీ భారీ ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్ పాత్ర పోషిస్తుండడం కూడా ఈ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఈ మధ్య సంజయ్ దత్ పుట్టినరోజు సందర్భంగా సంజయ్ పోషిస్తున్న అధీరా పాత్ర ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. అధీరా గెటప్ కు ప్రేక్షకుల నుండి భారీ స్పందన దక్కింది.

 

సంజయ్ దత్ పాత్ర ఫస్ట్ లుక్ బయటకు వచ్చినప్పటి నుంచి ఈ సినిమాలో హీరో విలన్ మధ్య పోటీ ఎలా ఉంటుందోనని, అధీరాకు సంబంధించిన సన్నివేశాలు ఎలా ఉంటాయోనని ఊహాగానాలు మొదలయ్యాయి. ఇదిలా ఉంటే 'కెజిఎఫ్- 2' యూనిట్ మెంబర్స్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో యష్, సంజయ్ దత్ మధ్య వచ్చే సీన్లు ప్రేక్షకులను కట్టిపడేస్తాయట . ఇక క్లైమాక్స్ పోర్షన్లో ఇద్దరి పోరాటం ప్రేక్షకులను థ్రిల్ చేస్తుందని, సినిమాలో అదే హైలెట్ అని అంటున్నారు.

 

మొదటి భాగంలో సంజయ్ లేకుండానే భారీ విజయం సాధించిన ఈ సినిమా ఇప్పుడు సంజయ్ ప్రెజెన్స్ తో ఉత్తరాది ప్రేక్షకులను మరింతగా మెప్పిస్తుందని, ఈ సినిమా మొదటి భాగం అలాగే ఘన విజయం సాధించడం ఖాయమని అంటున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS