సినిమాలు ఎప్పుడైతే తగ్గుతాయో.. అప్పుడు సోషల్ మీడియాలో కావల్సిన దానికంటే ఎక్కువ హడావుడి చేస్తుంటారు సినీ సెలబ్రెటీలు. ఇలియానా కూడా అదే బాపతు. ఇప్పుడు ట్విట్టర్, ఇన్‌స్ట్రాలను వేదికగా చేసుకుని.. తన హాట్ ఫొటోలతో, కామెంట్లతో.. హల్ చల్ చేయడం మొదలెట్టింది. తాజాగా ఇలియానా చేసిన కామెంట్లు టాలీవుడ్ లో చర్చనీయాంశమయ్యాయి.
''చిత్రసీమలో ప్రతిభ ఉన్నా ఎవరూ పట్టించుకోరు. వీలైనంత వరకూ తొక్కేయడానికే ప్రయత్నిస్తారు. జనాలు మనల్ని వెండి తెరపై చూసినంత వరకే అవకాశాలు వస్తాయి. ఆ తరవాత... పట్టించుకునే నాధుడే ఉండడు'' అంటూ హాట్ కామెంట్లు చేసింది ఇలియానా. ఇదంతా అవకాశాలు రాకపోవడం వల్ల వచ్చిన ఫస్ట్రేషనే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగులో ఇలియానాకు ఇప్పుడు ఛాన్సులు లేవు. బాలీవుడ్ లోనూ అంతంత మాత్రమే. తెలుగులో ఈమధ్య కొన్ని అవకాశాలు వచ్చినా వాటిని సద్వినియోగ పరచుకోలేకపోయింది. ఇప్పుడు `తొక్కేస్తున్నారు` అంటూ నిందలు వేస్తోంది. ఏంటో ఈ ఇల్లూ బేబీ. కనిపించినంత సుకుమారం అయితే ఏం కాదు. లోలోపల ఓ అగ్నిగోళం రగులుతూనే ఉంటుంది.