నేను ఆ టైపు కాదు: ఇలియానా

మరిన్ని వార్తలు

ఎవరి కాపురంలోనో నిప్పులు పోసే నైజం నాది కాదు. పదేళ్ళకుపైనే సినీ పరిశ్రమలో వున్నాను. ఎప్పుడూ ఏ హీరోతోనూ 'లింక్‌' చేస్తూ నా మీద గాసిప్స్‌ రాలేదు. ఇన్నేళ్ళ కెరీర్‌ తర్వాత తొలిసారిగా అజయ్‌ దేవగన్‌ లాంటి జెంటిల్‌మెన్‌ ఇమేజ్‌ని నాతో లింకప్‌ చేసి పాడు చేయాలని చూస్తే ఊరుకునేది లేదంటూ గుస్సా అయ్యింది నాజూకు నడుము సుందరి ఇలియానా. 

నిజమే, సౌత్‌లో ఇలియానా చాలామంది హీరోలతో సినిమాలు చేసిందిగానీ, ఎవరితోనూ ఇలియానాకి ఎఫైర్‌ వున్నట్టు గాసిప్స్‌ రాలేదు. వర్క్‌ విషయంలో చాలా స్ట్రిక్ట్‌ ఇలియానా. ఒకింత పొగరు చూపిస్తుందేమోగానీ, లవ్‌ - డేటింగ్‌ లాంటి విషయాల జోలికి వెళ్ళలేదు. ఆండ్రూ అనే విదేశీ ఫొటోగ్రాఫర్‌తో మాత్రం ఇలియానా ఎఫైర్‌ కొనసాగించింది. ఇటీవలే అతన్ని పెళ్ళాడింది కూడా. చిత్రంగా పెళ్ళయ్యాకనే ఓ హీరోతో ఇలియానాకి 'లింకప్‌' గాసిప్స్‌ షురూ అయ్యాయి. అదే ఆమెను ఇంకా బాగా హర్ట్‌ చేసేస్తోంది. 

'నా గురించి సౌత్‌లో అడిగి చూడండి' అంటూ ఇలియానా, బాలీవుడ్‌ మీడియాకి క్లాస్‌ తీసుకుంది అజయ్‌ దేవగన్‌తో ఎఫైర్‌ గాసిప్స్‌ గురించి ప్రస్తావన వస్తే. ఇదంతా అజయ్‌ దేవగన్‌, తన తాజా చిత్రంలో ఇలియానాని దర్శక నిర్మాతలకు రిఫర్‌ చేయడమే. అది చాలా చిన్న విషయమనీ, తాను ఆ టైపు కాదనీ ఇలియానా క్లారిటీ ఇచ్చింది. ఇలియానా క్లారిటీ వచ్చినా గాసిప్స్‌ ఆగుతాయా? ఛాన్సే లేదు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS