'రంగస్థలం' సినిమా ఏ జోనర్‌కి చెందినదో అర్థం కాలేదు చాలామందికి సినిమా ప్రారంభమయినప్పుడు. కావిడిని (ఓ కర్రకి చెరోవైపు బిందెలు కట్టి, భుజాన మోసేది) భుజాన మోస్తూ చరణ్ ఇమేజ్‌ని బ్యాక్‌సైడ్ నుంచి ఆర్ట్ రూపంలో చూపించారు సినిమా ప్రారంభమవుతోందని చెబుతూ అప్పట్లో. దాంతో ఎవరికీ ఈ సినిమాపై ఓ అవగాహనకు రావడానికి వీల్లేకపోయింది.
'బహుశా ఇదేదో ఆర్ట్ ఫిలిం అయి వుంటుంది' అనుకున్నారు చాలామంది. కానీ, సీన్ మారిపోయింది. 'రంగస్థలం' ఫస్ట్ లుక్‌తోనే ఇదొక కంప్లీట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ అనే అభిప్రాయం కలిగింది. ఆ అభిప్రాయాల్ని మరింత బలం చేకూర్చేలా ఒకదాని తర్వాత ఒకటి ప్రోమోస్ బయటకు వస్తున్నాయి. లేటెస్ట్‌గా చరణ్ డాన్స్ షో చూసి అంతా అవాక్కయ్యారు. 'రంగా రంగా రంగస్థలానా' అంటూ సాగే టైటిల్ సాంగ్‌ని అత్యద్భుతంగా పిక్చరైజ్ చేశారు. ఈ పాటలో చరణ్ స్టెప్పులు అదిరిపోయాయ్.
వినపడని పాటకి స్టెప్పులేయడమంటే ఆ కిక్కే వేరప్పా! అనుకున్నాడో ఏమోగానీ, చరణ్ పూనకంతో ఊగిపోయాడంతే. సినిమాలో హీరోకి చెవులు సరిగ్గా విన్పించవు. ఆ విషయాన్ని ఇంకా అందంగా ఈ పాటలో చెబుతూ, సామాజిక అంశాల్ని జోడించడం గమనార్హం. తన కెరీర్‌లోనే ది బెస్ట్ హీరో ఇంట్రడక్షన్ సాంగ్ అవుతుందంటూ చరణ్ చెప్పాడు ఈ పాట గురించి. అ
దెంత ప్రత్యేకమైనదో ఈ పాట చూస్తే అర్థమవుతుంది. 'రంగా రంగా రంగస్థలానా..' అంటూ చరణ్, థియేటర్‌లో అభిమానులతో స్టెప్పులేయించడం ఖాయమైపోయిందన్నమాట.