రవితేజ్ సీక్రెట్ చెప్పేసిన ఇలియానా

By iQlikMovies - November 11, 2018 - 12:12 PM IST

మరిన్ని వార్తలు

మాస్ మహారాజా రవితేజ గురించిన ఒక సీక్రెట్ ని అందాల తార ఇలియానా అందరి ముందు బయటపెట్టేసింది. ఈ సంఘటన నిన్న జరిగిన అమర్ అక్బర్ అంటోనీ ప్రీ-రిలీజ్ వేడుకలో జరిగింది.

పూర్తి వివరాల్లోకి వెళితే, అమర్ అక్బర్ అంటోనీ ఈవెంట్ లో మాట్లాడుతూ- రవితేజతో ఇది నాకు మూడవ చిత్రం. ఆయనతో పనిచేయడం ఒక ఫ్రెండ్ తో వర్క్ చేస్తున్న ఫీలింగ్ ఉంటుంది. పైగా ఈ చిత్రంలో రవితేజ సిక్స్ ప్యాక్స్ తో ప్రేక్షకులని కనువిందు చేయనున్నాడు.

ఇది వినగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎందుకంటే ఆయన సిక్స్ ప్యాక్స్ ఈ సినిమా కోసం చేశారు అన్నది ఇప్పటివరకు ఎవ్వరికీ తెలియదు. అంతేకాకుండా ఈ సినిమాలో అదే ప్రధాన ఆకర్షణ మరియు అభిమానులకి స్వీట్ సర్ప్రైజ్ అని అంటున్నారు.ఇలాంటి ఒక సీక్రెట్ ని నిన్న ఇలియానా నిన్న బయటకి చెప్పేయడంతో ఈ సినిమాకి సంబంధించిన ఒక సీక్రెట్ విడుదలకి ముందే బయటపడడం జరిగింది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS