నెట్టింట్లో ఎలాంటి లిమిట్స్ లేవు. ఎవరు, ఎవరినైనా నిందించొచ్చు. ట్రోల్ చేయొచ్చు. సిగ్గులేకుండా వ్యవహరించొచ్చు. అదీ నేటి నెట్టింటి పరిస్థితి. పండగ అయినా, పబ్లిసిటీ అయినా అక్కడే జరిగిపోతున్నాయి. ముఖ్యంగా సెలబ్రిటీల విషయంలో నెట్టిల్లు చుక్కలు చూపిస్తోంది ఈ మధ్య. సెలబ్రిటీల నుండి ఏ చిన్న తప్పు జరిగినా ఓ ఆట ఆడేసుకుంటున్నారు నెటిజన్లు. మొహమాటం లేకుండా, ఆడి పోసేసుకుంటున్నారు.
నచ్చితే ఆకాశానికెత్తేసేది అక్కడి నుండే. నచ్చకుంటే, పాతాళానికి తోసేసేది అక్కడి నుండే. తాజాగా బెల్లీ బ్యూటీ ఇలియానాకి నెట్టింట్లో చేదు అనుభవం ఎదురైంది. ఈ మధ్య తన బోయ్ ఫ్రెండ్‌తో బ్రేకప్ చేసుకున్న ఇలియానా ఇష్యూ నెట్టింట్లో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఓ నెటిజన్ ఇలియానాకి సూటిగా ఓ ప్రశ్న సంధించాడు. 'నువ్వు వర్జినిటీ ఎప్పుడు కోల్పోయావ్?' అంటూ సూటిగా అడిగేశాడు. అఫ్‌కోర్స్ ఇలాంటి ప్రశ్నలు సెలబ్రిటీలకు కొత్తేమీ కాదులెండి. కానీ, ఇలియానా మాత్రం కాస్త సీరియస్‌గా రియాక్ట్ అయ్యింది. 'మీ అమ్మని అడుగు..' అని ఘాటుగా సమాధానమిచ్చింది.
ఇంతకు ముందు ఇంచుమించు ఇలాంటి ప్రశ్నే ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్‌కి ఎదురైంది. ఆ ప్రశ్నకు రకుల్ కూడా సేమ్ టు సేమ్ ఇదే తరహాలో ఆన్సర్ ఇచ్చింది. అప్పుడు ఆ ఇష్యూతో రకుల్ వివాదాస్పదమైంది. ఇప్పుడు ఈ ఇష్యూతో ఇలియానా వివాదాస్పదమైంది. అయినా ఏం లాభం.? నెటిజన్స్ తీరు మాత్రం మారడం లేదు.