'రోబో 2.0' సినిమా తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్ 'భారతీయుడు 2'. భారీ బడ్జెట్‌తో ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు శంకర్. లైకా సంస్థ ఈ సినిమాని రూపొందిస్తోంది. అయితే, ఈ సినిమా విషయంలో కమల్‌హాసన్‌కీ, నిర్మాణ సంస్థకూ, అలాగే డైరెక్టర్‌కీ, నిర్మాణ సంస్థకూ, డైరెక్టర్‌కీ, హీరోకీ కూడా పొంతన కుదరడం లేదంటూ రకరకాల గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఆయా కారణాలతో సినిమాని అర్ధాంతరంగా మధ్యలో ఆపేశారనే టాక్ కూడా నడుస్తోంది. కానీ 'భారతీయుడు 2' ఆగిపోలేదట.
ప్రస్తుతం చిన్న బ్రేక్ మాత్రమే తీసుకున్నారట. అది కూడా కమల్‌హాసన్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉండడమే అంటూ కోలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. అయితే, ఇది చాలా చిన్న రీజన్. కానీ తెర వెనకు ఇంకా పెద్ద రీజన్స్ ఏవో చక్కర్లు కొడుతున్నాయి. అయితే వాటి విషయంలో పక్కా క్లారిటీ లేదు. కానీ, కొంత భాగం షూటింగ్ జరుపుకున్న 'భారతీయుడు 2' మళ్లీ జూన్ నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుందని తెలుస్తోంది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. కాజల్‌కిది కెరీర్‌లో బిగ్గెస్ట్ అచీవ్‌మెంట్. అయితే, ఈ అచీవ్‌మెంట్‌ని కాజల్ ఫుల్ ఫిల్ చేసుకుంటుందో లేదో చూడాలిక.