ప్రబాస్ ఇప్పుడు టాలీవుడ్‌కే కాదు, ఓవరాల్ ఇండియాకే డార్లింగ్ అయిపోయాడు. ఇదంతా 'బాహుబలి పుణ్యమే. ఇకపోతే ప్రస్తుతం ప్రబాస్ 'సాహో' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 'రన్ రాజా రన్' ఫేం సుజిత్ ఈ సినిమాకి దర్శకుడు. భారీ బడ్జెట్ చిత్రమిది. ఇంత భారీ బడ్జెట్ సినిమాకి కేవలం ఒకే ఒక సినిమాని తెరకెక్కించిన అనుభవమున్న డైరెక్టర్ సుజిత్‌ని తీసుకోవడమే కాదు, కంటిన్యూ చేయడం వెనక బోలెడంత సపోర్ట్ ఉంది. ఆ సపోర్ట్ అంతా ప్రబాస్‌దేనట.
హీరోగా ప్రబాస్‌కి క్లాస్, మాస్ అనే తేడా లేకుండా బాగానే అనుభవముంది. ఈ అనుభవంతోనే మన డార్లింగ్, డైరెక్టర్ సుజిత్‌కి స్క్రీన్‌ప్లేలో ఒకటీ అరా ఐడియాలిస్తున్నాడట. దాంతో సుజిత్‌కి పని కాస్త తేలికయినట్లవుతోందట. అరతేకాదు, ఒకవేళ ఈ సినిమా సూపర్ హిట్ అయ్యిందంటే సుజిత్ భవిష్యత్తే మారిపోతుందనండం నిస్సందేహం. అయితే ఒకప్పుడు డైరెక్టర్స్ కమిట్‌మెంట్‌తో వ్యవహరించాల్సి వచ్చేది.
కానీ ఇప్పుడు 'కమిట్‌మెంట్' అనే పదానికే అర్ధం లేకుండా పోయింది. ఏ చిన్న తేడా వచ్చినా, ఏ చిన్న అనుమానం వచ్చినా, డైరెక్టర్లు తృణప్రాయంగా ఒప్పుకున్న సినిమాల్ని మధ్యలోనే వదిలిపెట్టేస్తున్నారు. సో సుజిత్ విషయమైనా అంతే. ప్రబాస్ లాంటి హీరోని హ్యాండిల్ చేయలేను అనిపిస్తే సినిమాని వదిలేసే అవకాశం ఉంది. కానీ కమిట్‌మెంట్‌తో తాను చేయగలను అనే నమ్మకంతో ప్రబాస్‌తో 'సాహో'ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు సుజిత్. అందుకే సినిమా విడుదలయ్యాక సక్సెస్, ఫెయిల్యూర్ అనే మాట మర్చిపోయి, సుజిత్‌కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే మరి.