రాదు రాదనుకున్న 'సింగం' రానే వచ్చింది

మరిన్ని వార్తలు

ఎన్నో వాయిదాల తర్వాత టెన్షన్‌ టెన్షన్‌గా విడుదలయ్యింది సూర్య నటించిన 'సింగం 3' సినిమా. ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడిన ఈ సినిమా ఈ సారైనా వస్తుందో లేదో అనే అనుమానం అంతటా ఉంది. అయితే మొత్తానికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు, తమిళ్‌ భాషల్లో విడుదల కావాల్సిన ఈ సినిమాకి తమిళనాట ఏర్పడిని అనూహ్య వాతావరణం అడుగడుగునా అడ్డంకిగా మారింది. తాజా పరిస్థితులు కూడా తమిళనాడులో అనుకూలంగా లేవు నిజానికి. కానీ ఎలాగో ఎట్టకేలకు ఈ సినిమాని విడుదల చేశారు. నిజానికి తెలుగు నాట ఏమీ గొడవలు లేవు. తమిళంలోనే గొడవలు. కానీ తెలుగులో ఈ సినిమాని కాస్త లేటుగా విడుదల చేశారు. సింగం సిరీస్‌ సినిమాలపై ఉన్న ఆశక్తితో ఈ సినిమాని లేటుగా వచ్చినా, చూసేందుకు జనం ఆశక్తి చూపారు. అనుష్క, శృతిహాసన్‌ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌ అందించారు. హరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. 'సింగం' సిరీస్‌లో వచ్చిన రెండు సినిమాలు సూపర్‌ హిట్‌ అయ్యాయి సూర్య కెరీర్‌లోనే ది బెస్ట్‌ మూవీస్‌ అని చెప్పుకోవచ్చు ఆ రెండు సినిమాలు. ఇప్పుడు ఈ సినిమా కూడా అంచనాలకు తగ్గట్లుగానే సూర్యకి మంచి ఓపెనింగ్స్‌ తెచ్చిపెట్టిందంటున్నారు. తెలుగులో 'యముడు 3' పేరుతో విడుదలైంది ఈ సినిమా. 

Tags:

JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS