'ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య'కు 38 సంవత్సరాలు.

మరిన్ని వార్తలు

ఈ చిత్రం లో రాజశేఖరం గా చిరంజీవి, జయ లక్ష్మి గా మాధవి ప్రధాన పాత్రలు పోషించగా, ఇతర ముఖ్యపాత్రలలో పూర్ణిమ, పి. ఎల్. నారాయణ, గొల్లపూడి మారుతీ రావు, సంగీత తదితరులు నటించారు. ఈ చిత్రానికి కోడి రామకృష్ణ గారు తొలి సారీ కథ, స్క్రీన్ ప్లే దర్శకత్వం చేయగా గొల్లపూడి మారుతీరావు గారు తొలి సారీ నటించి అద్భుత మైన మాటలు అందించారు.

 

కథ లో క్లుప్తం గా రాజశేఖరం(చిరంజీవి) ఒక సివిల్ ఇంజనీరు. ఓ పనిమీద పల్లెటూరికి వచ్చి జయలక్ష్మి (మాధవి) తో ప్రేమలో పడతాడు. వారిద్దరూ పెళ్ళి చేసుకుని నగరానికి వచ్చి కాపురం పెడతాడు. పైకి మంచి మాటలు మాట్లాడుతూ లోపల కుటిల ప్రవర్తన గల సుబ్బారావు(గొల్లపూడి) జయలక్ష్మి(మాధవి) మీద కన్నేస్తాడు. ఈ సమస్యలన్నింటికీ ఆ జంట ఎలా పరిష్కరించుకున్నారన్నదే ప్రధాన కథ.

 

ఈ చిత్రం 8 కేంద్రాల్లో 50 రోజులు 2 కేంద్రాల్లో 100 రోజులు రన్ అయ్యింది హైదరాబాద్ సిటీ లో డైరెక్ట్ రిలీజ్ లో శాంతి (నారాయణ గూడ) లో 3 ఆటలు -106. డైరెక్ట్ రన్ మరియు నాంపల్లి - లత లో ఉదయం ఆటలు -52 రోజులు డైరెక్ట్ రన్ + షిఫ్ట్ పై సిటీ లో 519 రోజులు రన్ కావటం విశేషం.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS