బుజ్జి గాడితో ప్రభాస్ సందడి

మరిన్ని వార్తలు

బుధవారం రాత్రి హైదరాబాద్  రామోజీ ఫిల్మ్ సిటీలో కల్కి ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ లో 'బుజ్జి' అనే వాహనాన్ని కూడా రివీల్ చేసారు. కల్కిలో ప్రభాస్ కోసం స్పెషల్ గా డిజైన్ చేసిన ఈ వెహికల్ కి 'బుజ్జి' అని ముద్దు పేరు పెట్టుకున్నారు. కల్కి సినిమా  గ్లింప్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. బుజ్జి ని ప్రభాసే స్వయంగా డ్రైవ్ చేసుకుని రావటం గమనార్హం. ఈ ఈవెంట్ లో ప్రభాస్, కల్కి మూవీ టీమ్ పాల్గొన్నారు. మీడియా మిత్రులతో పాటు, డార్లింగ్ ఫాన్స్ కూడా అటెండ్ అయ్యారు. తన ఫాన్స్ ని ఉద్దేశించి ప్రభాస్ ఒక క్రేన్ పై నిలబడి  మాట్లాడారు. 


ప్రభాస్ తన ఫాన్స్ ని ఉద్దేశించి హాయ్ డార్లింగ్స్ అని ముచ్చటగా పలకరించారు. కల్కి మూవీ  గ్లింప్స్ ఎలా ఉంది అని అడిగాడు. వెంటనే అందరికీ సారీ చెప్పాడు. కారణం ఈవెంట్ కి ఫాన్స్ అందర్నీ పిలవలేకపోయినందుకు, చుట్టూ ఫెన్సింగ్స్ వేసినందుకు. మీ సేఫ్టీ కోసమే ఇలా చేసినట్టు పేర్కొన్నాడు ప్రభాస్.  కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ లకి ఈ సినిమాలో నటించినందుకు  థ్యాంక్స్ చెప్పాడు. సాగర సంగమం సినిమా చూసి కమల్ సర్ వేసుకున్న బట్టలు కావాలని మా అమ్మని అడిగాను. ఇప్పుడు ఆయనతో కలిసి నటించటం ఆనందంగా ఉంది అని చెప్పాడు. ప్రతి ఒక్కర్నీ పేరు పేరునా గుర్తు పెట్టుకుని వారి గూర్చి ప్రస్తావించాడు. నిర్మాత అశ్వినీదత్ పై ప్రశంసలు కురిపించాడు. ఈ ఏజ్ లో కూడా అశ్వనీదత్ గారు సినిమా కోసం తపిస్తున్నారు అని, బడ్జెట్ లెక్కలు వేసుకోకుండా, కల్కిని అద్భుతంగా తెరకెక్కించారని, కీర్తించాడు. అశ్వినీదత్, కూతుళ్ళకు సినిమా  అంటే ఉన్న ప్యాషన్ గురించి ప్రస్తావించాడు. 


తాను వాడిన బుజ్జి వాహనం గూర్చి ఇంతలా ఇంటర్డ్యూస్ చేస్తారని అనుకోలేదు. అని హ్యాపీగా ఫీల్ అయ్యాడు ప్రభాస్. కల్కి మూవీలో ప్రభాస్ లుక్ ఎలా ఉంటుందో ఈవెంట్ లో కూడా అదే లుక్ లో ఎంటర్ అయ్యాడు ప్రభాస్.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS